ఒక్క మ‌హిళ వ‌ల్ల ఆ దేశంలో తొలిసారి లాక్‌డౌన్!!

చైనాలో పురుడు పోసుకున్న ప్రాణాంత‌క వైర‌స్ క‌రోనా.కంటికి క‌నిపించ‌కుండా ప్ర‌పంచ‌దేశాలను అత‌లాకుత‌లం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

 Lockdown Imposed Bhutan For The First Time Due To A Woman! Lockdown, Bhutan, A-TeluguStop.com

మొద‌ట క‌రోనా అంటే లెక్క‌చేయ‌ని ప్ర‌జ‌లు.ఇప్పుడు క‌రోనా పేరు చెబితేనే గ‌డ‌గ‌డ‌లాడిపోతున్నారు.

అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు.ఇక ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2.04 కోట్లను దాటాయి.

అలాగే క‌రోనా కాటుకు బ‌లైన వారి సంఖ్య 7.4 ల‌క్ష‌లు మించిపోయింది.ఈ మహమ్మారి వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేసేందుకు దేశాలన్నీ కూడా దశల వారీగా లాక్ డౌన్ విధించినా.క‌రోనా మాత్రం అదుపులోకి రాలేదు.దీంతో దేశ‌ల‌న్నీ అన్‌లాక్ ప్ర‌క్రియ ప్రారంభించ‌డంతో.క‌రోనా మ‌రింత వేగంగా విజృంభిస్తోంది.

ఇదిలా ఉంటే.ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కొన్ని దేశాలపై ప్ర‌భావం చూప‌లేక‌పోయిన సంగ‌తి తెలిసిందే.

అలాంటి దేశాల జాబితాలో భూటాన్ కూడా ఒకటి.భూటాన్‌కు క‌రోనా వ్యాపించ‌కుండా.అక్క‌డ అధికారులు ఎన్నో క‌ఠ‌న‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.అయితే ఇప్పుడు ఈ దేశంలో కూడా క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాపించింది.

ఈ క్ర‌మంలోనే భూటాన్‌లో తొలిసారి లాక్‌డౌన్ విధించారు.కువైట్ నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా సోకింది.

వాస్త‌వానికి కువైట్ నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉన్న ఈ మహిళకు కరోనా టెస్ట్ చేయ‌గా మొద‌ట‌ నెగిటివ్ అని తేలింది.

అయితే ఆమెను క్వారంటైన్ నుంచి ఇంటికి పంపే ముందు సోమవారం మ‌రోసారి టెస్ట్ చేయ‌గా.

పాజిటివ్ వ‌చ్చింది.దీంతో ఆమెను క‌లిసిన వారికి మ‌రియు ఆమెతో క్వారంటైన్‌లో ఉన్న‌వారికి క‌రోనా టెస్ట్‌లు చేయ‌డం ప్రారంభించారు.

అదే స‌మ‌యంతో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తొలిసారి లాక్‌డౌన్ విధించారు.ప్రజలెవరూ అనవసరంగా బయటకు రావొద్దంటూ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube