లాక్ డౌన్ పొడిగిస్తే మరింత కష్టం అంటున్న ప్రముఖ పారిశ్రామికవేత్త

కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న విషయం విదితమే.ఇప్పటికే ఈ లాక్ డౌన్ వల్ల ఆర్థికరంగం పూర్తిగా కుదేలు అవుతుండడం తో సడలింపులతో కూడిన లాక్ డౌన్ ను కేంద్రం అమలు పరుస్తుంది.

 Lockdown Extensions Economically Disastrous Create Another Medical Crisis Says A-TeluguStop.com

లాక్ డౌన్ ను పూర్తి స్థాయిలో ఎత్తివేయకుండా సడలింపులు చేసుకొంటూ వ్యూహంతో కేంద్రం వ్యవహరిస్తోంది.అయితే ఇప్పటికే ఈ కరోనా దెబ్బకు అన్ని రంగాలు కుదేలు అయ్యాయి.

ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం తీవ్రంగా దెబ్బతిన్నది.లాక్‌డౌన్ వల్ల ఎప్పుడూ ఎదుర్కొనని ఆర్థిక సవాలును ఎదుర్కొంటున్నది.

ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా లాక్‌డౌన్ వల్ల కలిగే నష్టాలను వివరించారు.ఇప్పటికే దేశం ఆర్థికంగా చాలా క్షీణించిందని, ఇంకా లాక్‌డౌన్ పొడిగిస్తే ఆర్థిక వినాశనం తప్పదంటూ ఆయన హెచ్చరిస్తున్నారు.

మళ్లీ లాక్‌డౌన్ పొడిగిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండబోదని, వైద్యపరమైన సంక్షోభం కూడా తలెత్తే అవకాశం ఉందని ఆయన అంటున్నారు.అంతేకాకుండా ఈ లాక్‌డౌన్‌ను పొడిగిస్తే ప్రజల మానసిక ఆరోగ్యం పై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది అని వ్యాఖ్యానించారు.

మరోపక్క ఇప్పటికే సడలింపులతో కూడిన లాక్ డౌన్ అమలు పరుస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
గత నాలుగు రోజులుగా రోజుకు కనీసం 6 వేలకు పైగా కేసులు నమోదు అవుతుండడం మరింత ఆందోళన కలిగిస్తుంది.

ఈ క్రమంలోనే లాక్‌డౌన్ పొడిగిస్తే కరోనా కేసుల సంఖ్య తగ్గదని, అందువల్ల ఆ దిశగా ఆలోచనలు విరమించి.ఆస్పత్రి బెడ్లు, ఆక్సిజన్ లైన్లను పెంచాల్సిన అవసరం ఉందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube