సాయంత్రం 5 గంటల వరకు సడలింపు ఆ తర్వాత మరో గంట..!

తెలంగాణాలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రతని నియంత్రించడానికి సీఎం కే.సి.

 Lockdown Extended Restrictions To Be Eased In Telangana State, Cm Kcr, Extended,-TeluguStop.com

ఆర్ మే 12 నుండి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.ముందు 10 రోజులు అనగా మే 21 వరకు లాక్ డౌన్ పెట్టారు.ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే సడలింపులు ఇచ్చారు.21 నుండి మే 30 వరకు అదే విధంగా లాక్ డౌన్ కొనసాగించారు.అయితే మే 30 న జూన్ 9 వరకు మరోసారి లాక్ డౌన్ ప్రకటించారు.అయితే ఈసారి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు సడలింపులు ఇవ్వగా ప్రజలు గమ్యస్థానాలు చేరుకునేందుకు మరో గంట పర్మిషన్ ఇచ్చారు.

అంటే 2 గంటల నుండి మళ్లీ ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది.

జూన్ 9 తో పూర్తవుతున్న లాక్ డౌన్ పై అదే విధంగా కొనసాగించాలా లేక కొన్ని సడలింపులు ఇవ్వాలా అని మరోసారి కేబినేట్ మీటింగ్ జరుగనుంది.

అయితే ఈ క్రమంలో తెలుస్తున్న సమాచారం ప్రకారం జూన్ 9 నుండి సడలింపులు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని చెబుతున్నారు.ఐదు గంటల వరకు సడలింపు మరో గంట పాటు ప్రజలు వారి వారి ఇల్లకు చేరుకునే అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తుంది.

రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తుంది.కేసులు అదుపులో ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube