కరోనా ఎఫెక్ట్… మనుషుల కంటే ముగాజీవాలకే అవస్థలు  

Lockdown Effect On Animals Corona Virus - Telugu Corona Effect, Covid-19, Lock Down Crisis, Lockdown Effect On Animals

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ఇంచుమించు అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి.ఇక ఇండియాలో కూడా లాక్ డౌన్ చాలా సీరియస్ గా అమలవుతుంది.

 Lockdown Effect On Animals Corona Virus

ప్రజలు ఇళ్ళ నుంచి బయటకి రావొద్దని ప్రభుత్వం పదే పదే హెచ్చరిస్తుంది.ఇక పోలీసులు లాఠీలు పట్టి బయటకి వచ్చే వారిపై తమ యాక్షన్ సినిమా చూపిస్తున్నారు.

మరో వైపు ప్రజలు కూడా ముఖ్యంగా పట్టణాలలో ఇల్లు విడిచి బయటకి రావడం లేదు.ఇలాంటి పరిస్థితిలో తమకే దిక్కులేదంటే మూగజీవాలని ఎవరు పట్టించుకుంటారు.

కరోనా ఎఫెక్ట్… మనుషుల కంటే ముగాజీవాలకే అవస్థలు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆ అవకాశం కూడా లేదు.

ప్రాణాల మీదకి వచ్చినపుడు తమకంటే బయట తిరిగే మూగజీవాలు అంత ముఖ్యం కాదని అందరూ భావిస్తారు.

అలాగే జూలలో ఉండే జంతువులకి కూడా అదే పరిస్థితి.వీటికి కనీసం తిండి పెట్టేవారు కరువయ్యారు.

దీంతో మనుషుల కంటే ఆకలి కేకలు వాటికి ఎక్కువయ్యాయి.మామూలు రోజులలో అయితే వాటికి ఎవరో ఒకరు, ఎక్కడో ఒక చోట తిండి పెట్టేవారు.

ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం ఆకలితో పాటు చుట్టూ జనసంచారం పెద్దగా కనిపించకపోవడం వాటి అవి కూడా హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయినట్లు ఉన్నాయి.దాంతో ఎక్కడ మూగజీవాల హడావిడి కనిపించడం లేదు.

అలాగే జూలలో ఉండే జంతువులకి కూడా ప్రతి రోజు ఆహారం అందించలేని పరిస్థితి నెలకొని ఉన్నట్లు తెలుస్తుంది.దీంతో ఆకలితో చాలా జంతువులు అలమటిస్తున్నాయి.

కరోనా ఎఫెక్ట్ మనుషుల మీద ఎంత ప్రభావం చూపిస్తుందో కాని మూగజీవాల మీద కూడా ఎక్కువగానే ప్రభావం చూపిస్తున్నట్లు కనిపిస్తుంది.అయితే కొంత మంది జంతు ప్రేమికులు మాత్రం అక్కడక్కడ రోడ్డు మీదకి వచ్చి వాటికి తిండి పెట్టె ప్రయత్నం చేస్తుండటం విశేషం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు