తప్పక తెలుసుకోండి : లాక్‌ డౌన్‌ సమయంలో సామాన్యులు చేయాల్సిన పనులు ఏంటీ?

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని పలు దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి.ప్రపంచంలోని వంద కోట్ల మంది పూర్తిగా ఇళ్లకే పరిమితం అవుతున్నారు.

 Lockdown Corona Virus Tips-TeluguStop.com

ఇండియాలో ఈ మహమ్మారి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్‌గా చర్యలు తీసుకుంటుంది.మోడీ పిలుపు మేరకు నిన్న జనతా కర్ఫ్యూ జరిగింది.

కరోనా భయం వెంటాడుతున్న నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు లాక్‌ డౌన్‌ను ప్రకటించాయి.తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్‌ డౌన్‌ ప్రకటించాయి.

చైనాలో మొదట వుహాన్‌ పట్టణంలో కరోనా పుట్టిన విషయం తెల్సిందే.అక్కడ మొదట లాక్‌ డౌన్‌ విధించారు.ఆ తర్వాత పలు దేశాల్లో కూడా లాక్‌ డౌన్‌ అమలు అవుతుంది.కొన్ని దేశాల్లో ఈమద్య లాక్‌ డౌన్‌ ఎత్తి వేయగా మన ఇండియాలో మాత్రం నేటి నుండి పలు రాష్ట్రాల్లో లాక్‌ డౌన్‌ అమలులోకి వచ్చింది.

ఈ సమయంలో ప్రభుత్వ అధికారులకు పూర్తి అధికారాలు ఉంటాయి.బయట ఎవరైనా ఊరికే తిరిగినట్లుగా తెలిస్తే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

Telugu Corona, Covid, Hyderabad, Lockdown, March-General-Telugu

ఈ సమయంలో సామాన్యులు ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం.
లాక్‌ డౌన్‌ సమయంలో అత్యవసరం అయితే తప్ప ఇల్లు దాటి బయటకు వెళ్ల కూడదు.
ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవడానికి వీలు లేదు.
ఎక్కడిక్కడ అన్ని కూడా బంద్‌ అయ్యి ఉంటాయి కనుక ఎలాంటి చిన్న చిన్న పనుల కోసం బయటకు వెళ్లేందుకు ప్రయత్నించవద్దు.
బార్‌లు ఇంకా వైన్స్‌ బంద్‌ ఉన్న కారణంగా బ్లాక్‌లో కొనుగోలు చేసేందుకు అస్సలు ప్రయత్నించవద్దు.
ఇంట్లో ఉన్న వస్తువులను చాలా జాగ్రత్తగా వాడుకోవాలి.

తక్కువ ఉన్న వాటిని కనీసం వారం పది రోజులు అయినా వచ్చేలా చూసుకోవాలి.
ఉదాహరణకు కూరగాయలు ఉంటే వాటిని పది రోజులకు సరిపెట్టుకునేలా ప్లాన్‌ చేసుకోవాలి.
ఇంట్లోంచి వర్క్‌ చేసే వారికి ఏ ఇబ్బంది లేదు కాని బయట తిరిగి జాబ్‌లు చేసే వారు తమ ఉద్యోగంను కొన్ని రోజులు పక్కన పెట్టడం బెటర్‌.అయినా ఉద్యోగం చేయకున్నా కూడా జీతాలు ఇవ్వాల్సిందే అంటూ ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
అప్పటి వరకు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ రోజు గడవాలి కదా అంటూ ప్రయాణాలు పెట్టుకోవడం బహిరంగ ప్రదేశాల్లో తిరగడం వంటివి చేయకూడదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube