ఆంధ్ర ప్రదేశ్ లో అక్కడ పూర్తిగా లాక్ డౌన్... కరోనా వల్లే... 

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది ఈ క్రమంలో ఇప్పటికే దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై ప్రాంతంలో ఎక్కువగా కరోనా వైరస్ కోరలు చాస్తోంది.దీంతో ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను చాలా కఠినంగా అమలు చేస్తోంది.

 Lockdown Announced In Guntur District, Lockdown News, Andhra Pradesh News, Coron-TeluguStop.com

కాగా  దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ టీకా నీ ప్రజలకి అందిస్తున్నప్పటికీ కరోనా వైరస్ మాత్రం నియంత్రణలోకి రావడం లేదు.

దీనికి తోడు ప్రజలు కూడా మాస్కులు ధరించకుండా మరియు సామాజిక దూరం పాటించకుండా యథెచ్ఛగా రోడ్లపై విహరిస్తూ ఉండడంతో రోజురోజుకీ  కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.

ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం మాత్రం లాక్ డౌన్ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోయినప్పటికీ తమ రాష్ట్రంలోని కరోనా వైరస్ పరిస్థితులను అదుపు చేయడానికి లాక్  డౌన్ విషయంలో నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికే వదిలిపెట్టింది.

కాగా గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ తీవ్రంగా మహమ్మారి విజృంభిస్తోంది.

దీంతో తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన కొల్లిపర మండలంలో రోజురోజుకీ కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో పూర్తిగా లాక్ డౌన్ విధించారు.అంతేకాకుండా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను పాటించాలని ప్రజలకి సూచిస్తున్నారు.

అలాగే అత్యవసర పరిస్థితులు మరియు నిత్య అవసరాల కోసం మాత్రమే ప్రజలు బయటకు రావాలని అనవసరంగా రోడ్లపై విహారం చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.అయితే ఈ లాక్ డౌన్ ఈ నెల పదో తారీకు నుంచి 16వ తారీకు వరకు కొల్లిపర మండలం పరిధిలోని గ్రామాలలో విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

దీంతో ఈ విషయం పై ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ నియంత్రించేందుకు టీకాలు అందిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ప్రభుత్వం విధించిన కోవిడ్  నిబంధనలను కచ్చితంగా పాటించి కరోనా వైరస్ మహమ్మారి అరికట్టేందుకు తోడ్పడాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube