ఫేసుబుక్ ప్రొఫైల్ ను ఈవిధంగా లాక్ చేయండి..

సోషల్ మీడియా సైట్లలో ఫేసుబుక్ కి ఉన్న క్రేజ్ అంత ఇంతా కాదు.ఈ ఫేసుబుక్ ద్వారా మన చిన్నపాటి మిత్రులను, బంధువులను మనకు దగ్గర చేస్తుంది.

 Lock Facebook Profile Like This-TeluguStop.com

ఇందులో మనం ఎవరి ప్రొఫైల్ ని అయినా చూడొచ్చు.అలాగే కొత్త ఫ్రెండ్స్ ని కూడా యాడ్ చేస్కోవచ్చు.

దీని కోసం మనం ముందుగా మొబైల్ లో ఫేసుబుక్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.ఆ తరువాత మన ఈ మెయిల్ ఐడీతో లేదా ఫోన్ నెంబర్ తో ఒక అకౌంట్ ను క్రియేట్ చేసుకుని లాగిన్ అవ్వాలి.

 Lock Facebook Profile Like This-ఫేసుబుక్ ప్రొఫైల్ ను ఈవిధంగా లాక్ చేయండి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తరువాత మనకు తెలిసిన మిత్రులకు బంధువులకు, మనతో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఫేస్ బుక్ సెర్చ్ లో వెతకవచ్చు.ఒక వేళ ఎవరిదైనా ఫేస్ బుక్ ఐడీ గాని, ఫోన్ నెంబర్ గాని తెలిసినా, వాళ్ళ ప్రొఫైల్ పిక్ కనిపించిన ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాము.

అలాగే వాళ్ళు మన రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తే ఫ్రెండ్స్ అవుతారు.ఇలా మనం తెలిసిన వాళ్ళు మన ప్రొఫైల్ ను చూస్తారు.

వాళ్ల ప్రొఫైల్ మనం చూడొచ్చు.

అయితే ఈ మధ్యకాలంలో ఫేస్ బుక్ లో చిన్న విషయమైనా పబ్లిక్ అయిపోతుంది.

ముఖ్యంగా ఫేస్ బుక్ లో ప్రైవసీ ఉండడంలేదు.ఫ్రెండ్ లిస్ట్ లో లేని యూజర్లు కూడా కొంత మంది మన ప్రొఫైల్ చూసి ఫేక్ ఐడీలతో ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పెడుతూ ఉంటారు.

అలా మన ప్రొఫైల్ లోని పర్సనల్ డీటెయిల్స్, పోస్టులు, ఫొటోలు, బయో డేటా చూసేస్తున్నారు.అలా జరగకుండా ఉండాలంటే మన ఫేస్ బుక్ ప్రొఫైల్ ని ఎవరు చూడకుండా ఇలా లాక్ పెట్టుకోవచ్చు.

మన ఆండ్రాయిడ్ మొబైల్ లో ఫేసుబుక్ యాప్ ఓపెన్ చేసి యాడ్ టు స్టోరీ అనే ఆప్షన్ ఉంటుంది.దాని పక్కనే మూడు డాట్స్ మీద క్లిక్ చేయాలి.అక్కడ లాక్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది.దాన్ని క్లిక్ చేస్తే ప్రొఫైల్ లాక్ కు సంబంధించిన సూచనలు కనిపిస్తాయి.వాటిని సెలెక్ట్ చేసుకుంటే you locked your profile అనే పాప్ అప్ విండో కనిపిస్తుంది.దీంతో మన స్నేహితులకు తప్ప ఇంకెవరికీ మన ప్రొఫైల్ కనిపించదు.

అయితే ఐఓఎస్ ఫేసుబుక్ లో మాత్రం ప్రొఫైల్ లాక్ కు సంబంధించిన ఆప్షన్స్ ఏమి లేవు.

#Unlock

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు