ప్రభుత్వం అనుమతించిన సినీ కార్మికుల ఆకలి కేకలు

లాక్ డౌన్ ఉన్న సమయంలో సినిమా పరిశ్రమకు చెందిన హేమా హేమీలు షూటింగ్ కు అనుమతులు ఇవ్వాల్సిందే అంటూ ప్రభుత్వాలను డిమాండు చేసిన వారు ఇప్పుడు ఎక్కడ పోయారో కనిపించడం లేదు.నెల రోజుల క్రితం షూటింగ్స్ కు అనుమతులు ఇస్తే ఇప్పటి వరకు కూడా షూటింగ్ కు స్టార్స్ ఎవరు కూడా వెళ్ళలేదు.

 Screaming Hunger Of Government-sanctioned Film Workers, Lock Down, Fim Workers,-TeluguStop.com

దాంతో సినీ కార్మికుల కష్టాలు అలాగే ఉన్నాయి.వారికి లాక్ డౌన్ లో మాదిరిగానే ఆకలి తప్పడం లేదు.

సీరియల్స్ షూటింగ్స్ అయితే ప్రారంభం అయ్యాయి.కానీ ఇప్పటి వరకు సినిమా కు చెందిన షూటింగ్స్ కేవలం 20 శాతం మాత్రమే ప్రారంభం అయ్యాయి.సినిమా కార్మికులు ఎక్కువగా ఉంటారు.అందుకే సినిమా షూటింగ్స్ జరగని కారణంగా వారంతా కూడా ఇంకా ఆకలి కేకలు పెడుతున్నారు.

సినీ పెద్దలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Telugu Coronavirus, Fim, Lock, Serial, Telugu-

పెద్ద హీరోలు ఎవరు కూడా షూటింగ్స్ కు ముందుకు రావడం లేదు.హైదరాబాద్ లో పెరుగుతున్న కేసుల కారణంగా షూటింగ్ కు వెళ్లేందుకు సిద్ధం కావడం లేదు.పెద్ద హీరోల సినిమాలు ఎప్పుడు అయితే మొదలు అవుతాయో అప్పటివరకు సినీ కార్మికుల ఆకలి కేకలు తప్పవు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube