నరసరావుపేటని కరోనా రెడ్ జోన్ గా మార్చేసిన వన్ బై టూ చాయ్

కరోనా మనిషి నుంచి మనిషికి సోకడానికి పెద్దగా కారణాలు అవసరం లేదు. షేక్ హ్యాండ్ ఇస్తే చాలు.

 One By Two Chai Corona Effect In Narasaraopet, Andhra Pradesh, Corona Red Zone,-TeluguStop.com

అయితే కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఎన్ని సూచనలు చేసిన ప్రజలలో ఉన్న నిర్లక్ష్యం కరోనా వ్యాప్తికి కారణం అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పక్కోడిని పలకరించే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్న రాసుకుపూసుకు తిరుగుతూ కరోనా పెరగడానికి వాహకాలుగా మారుతున్నాయి.

ఏపీలో కర్నూల్, గుంటూరు జిల్లాలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉంది.అక్కడ మర్కజ్ కి వెళ్ళి వచ్చిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం, వారు సకాలంలో ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రజలలో తిరగడం వారితో ఇతరులు కాంటాక్ట్ పెట్టుకోవడం కరోనా వ్యాప్తికి కారణంగా అధికారులు గుర్తించారు.

ముఖ్యంగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇక్కడ వందకు పైగా కేసులు బయటపడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

దీనికంతటికీ కారణంగా ఓ వ్యక్తి వన్ బై టూ చాయ్ తాగడమేనని తెలుస్తోంది.ఇటీవలే ఓ వ్యక్తి ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లి రాగా, అతడితో కలిసి ఓ కేబుల్ ఆపరేటర్ టీ తాగాడు.

అక్కడి నుంచే కరోనా వ్యాప్తి తీవ్రమైనట్టు అధికారులు గుర్తించారు.ఆ కేబుల్ ఆపరేటర్ కారణంగా 50 మందికి వ్యాధి సంక్రమించినట్టు తెలుసుకున్నారు.కేబుల్ ఆపరేటర్ గుంటూరులో చికిత్స పొందుతూ మరణించాడు.చనిపోయేంత వరకు అతనికి కరోనా ఉందనే విషయం తెలుసుకోలేకపోయారు.

కేబుల్ ఆపరేటర్ ద్వారా ఒక హోం గార్డ్ కి కరోనా సోకింది.అతను ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో సాధారణ చికిత్స తీసుకోవడంతో అక్కడ అతని నుంచి 20 మందికి కరోనా సోకింది.

వారిలో నలుగురు వైద్యులు కూడా ఉన్నారు. అలా ఇద్దరి కారణంగా కరోనా 70 మందికి నరసరావుపేటలో సోకింది.

ఇక వారి ద్వారా కాంటాక్ట్ కేసులు వంద దాటిపోయాయి.చిన్న నిర్లక్ష్యం పట్టణంలో ఇంత అనార్దానికి కారణం అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube