పిల్లుల ద్వారా ఇతర పిల్లులకు కరోనా వ్యాప్తి?

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వైరస్ కరోనా.లాక్ డౌన్ విధించి ప్రజలను ఎవరిని బయటకు రాకుండా చేసి ఆర్ధికంగా నష్టపోయిన సరే ఇంట్లోనే పెట్టినప్పటికీ కొంచం నిర్లక్ష్యంగా ఉంటే చాలు మళ్లీ వచ్చేస్తుంది ఈ కరోనా.

 Coronavirus Spreads From Cat To Cat  Coronavirus, Lock Down, Coronavirus Spread-TeluguStop.com

ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ నియంత్రించేందుకు ప్రపంచమంతా ఏకమై పరిశోధనలు చేస్తుంది.

ఇంకా ఈ నేపథ్యంలో అమెరికా పరిశోధనలో మరో షాకింగ్ విషయం బయటపడింది.

అది ఏంటి అంటే? కరోనా వైరస్ వ్యాధి సోకిన పిల్లుల నుంచి ఇతర పిల్లులకు కరోనా వ్యాపిస్తుందని తేలింది.ఎలా అంటే? కరోనా బారిన పడిన ఓ వ్యక్తికి సన్నిహితంగా ఉన్న మూడు పిల్లులను కేంద్రంలో ఉంచి అమెరికాలోని విస్కన్ సన్ విశ్వ విద్యాలయ పరిశోధకులు అధ్యయనం చేశారు.

Telugu America, Coronavirus, Lock-General-Telugu

కరోనా ఉన్న పిల్లులకు దగ్గరగా మరికొన్ని పిల్లులను ఉంచారు.ఇంకా ఆ తర్వాత వాటి ముక్కు నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు జరిపారు.అయితే ఆ పిల్లలలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ కరోనా వైరస్ సోకిందని నిర్దారించారు.అయితే పిల్లుల నుండి మనుషులకు కరోనా సోకుతుందా లేదా అనేది ఇంకా ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పారు.

దీనిపై మరికొన్ని పరిశోధనలు చెయ్యాలి అని పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube