నిజమేనా : ఈ నెల 31 తర్వాత అసలు లాక్ డౌన్ మొదలు కానుందట…   

Lock Down Corona Virus India - Telugu Corona Virus, Extend, India, Lock Down, Shut Down

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతగా కలకలం సృష్టిస్తుందో  పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి.

 Lock Down Corona Virus India

ఇందులో భాగంగా ప్రజలకు అవసరమైనటువంటి అత్యవసర సర్వీసులు తప్ప మిగిలిన అన్ని సర్వీసులను మూసివేశారు.అంతేగాక  పలు సంస్థలో పని చేసేటువంటి ఉద్యోగులకు కూడా తాత్కాలికంగా ఇంటి వద్ద నుంచే పని చేసే వీలు కల్పించారు.

అయితే గత కొద్ది రోజులుగా లాక్ డౌన్ లో సడలింపులు చేపట్టారు.ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ప్రజలు తమ పనులకు వెళ్లవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలు సూచించడంతో ప్రజలు యథెచ్ఛగా రోడ్లపైకి వస్తున్నారు.

నిజమేనా : ఈ నెల 31 తర్వాత అసలు లాక్ డౌన్ మొదలు కానుందట… -General-Telugu-Telugu Tollywood Photo Image

దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర ముప్పు వాటిల్లుతుందని కొందరు వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అంతేగాక మద్యం అమ్మకాలు కూడా చేపట్టడంతో మందుబాబులు కిలోమీటర్లమేర మద్యం దుకాణాల ముందు క్యూ కడుతున్నారు.

ఇలా చేయడం వల్ల కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతుందని కాబట్టి మద్యం దుకాణాలను మూసి వేయాలని కొందరు ప్రజా సంఘ నాయకులు ప్రభుత్వాలకు విన్నపాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రజలు కరోనా వైరస్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకోకుండా ఏదైనా రోడ్లపై తిరుగుతుండడంతో రోజురోజుకీ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

దీనికి తోడు మరణాల సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతుండడంతో  కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తారీఖున నుంచి మరోమారు పూర్తిగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించనున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.

ఈ సారి ఇంతకు ముందులాగా కాకుండా పూర్తిగా షట్ డౌన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు మొదలు పెట్టిందని పలువురు చర్చించుకుంటున్నారు.

ఇదే గనుక జరిగితే మరోమారు ప్రజలు పూర్తిగా తమ నివాసాల కి పరిమితం కావాల్సి ఉంటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test