కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్... వీడియో కాల్ తో పెళ్లి తంతు

కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నంలో దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.దీంతో చాలా మంది పెళ్ళిళ్ళు వాయిదా పడిపోయాయి.

 Marriage Solemnized On Phone In Maharashtra, Lock Down, Corona Effect, Muslim M-TeluguStop.com

నిజానికి మార్చి, ఏప్రిల్ నెలలు పెళ్ళిళ్ళ సీజన్స్.ఈ కాలంలో వేల సంఖ్యలో పెళ్ళిళ్ళు జరుగుతాయి.

అయితే జనం సమూహాలుగా ఉంటే కరోనా వ్యాపిస్తుందని వైద్యులు హెచ్చరించడం, ఇక ప్రభుత్వాలు రంగంలోకి దిగి పెళ్లి లాంటి శుభకార్యాలు వాయిదా వేసుకోవాలని సూచించడం జరిగింది.దీంతో చాలా మంది తమ పెళ్ళిళ్ళు వాయిదా వేసుకున్నారు.

వీరిలో టాలీవుడ్ హీరోలైన నితిన్, నిఖిల్ కూడా ఉన్నారు.అయితే ఈ లాక్ డౌన్ కారణంగా ఓ జంట వీడియో కాల్ ద్వారా వివాహం చేసుకున్నారు.

ఈ సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో జరిగింది.ఔరంగాబాద్ నగరానికి చెందిన ముహమ్మద్ మిన్ హజుద్ద్, బీడ్ పట్టణానికి చెందిన యువతితో ఏప్రిల్ 3వ తేదీన వివాహం జరిపించాలని రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు ఆరునెలల క్రితమే నిర్ణయించారు.

పెళ్లిమండపాలు మూసివేయడంతో పాటు కరోనా లాక్ డౌన్ సందర్భంగా ప్రజల రాకపోకలు నిలిచిపోవడంతో ఇంట్లో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి కొడుకు అమ్మాయి, వారి బంధువులతో వీడియో కాల్ ద్వారా చేసుకున్నారు.ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

హిందూ సంప్రదాయ వివాహ వ్యవస్థలో పెళ్లి తంతు జరగాలంటే అమ్మాయి మెళ్ళో అబ్బాయి తాళి కట్టాలి.కాని ముస్లిం సంప్రదాయంలో అమ్మాయి, అబ్బాయి పక్కపక్కన ఉండాల్సిన అవసరం లేదు.

ఈ నేపధ్యంలోనే వీరు పెళ్లి తంతుని వీడియో కాల్ ద్వారా పూర్తి చేసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube