సంచలనంగా మారిన మర్కజ్ చీఫ్ ఆడియో టేపులు

దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి.ఈ కేసులలో మెజారిటీ భాగం ఢిల్లీలో మర్కజ్ లో ప్రత్యేక ప్రార్ధనలకి వెళ్ళిన వారివే.

 Maulana Saad's Audio Tape Emerges, Lock Down, Corona Effect, Indian Government,-TeluguStop.com

సుమారు అన్ని రాష్ట్రాలలో ప్రార్ధనలకి వెళ్ళిన వారి నుంచి కరోనా వ్యాప్తి చెందింది.ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా మర్కజ్ కి వెళ్ళినవారి కారణంగా ఒక్కసారిగా కేసులు పెరిగిపోయి వంద దాటిపోయాయి.

దీంతో ఈ ప్రార్ధనలు నిర్వహించిన వారిపై తీవ్ర విమర్శలు వెళ్ళువెత్తుతున్నాయి.అయితే ఒక వర్గం మాత్రం ఈ ప్రార్ధనలు తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే వాటిని సమర్ధించుకుంటున్నారు.

అయితే ఇప్పుడు ఈ మర్కజ్ ప్రార్ధనల మీద కేంద్రం దర్యాప్తుకి ఆదేశించడంతో ఆ మసీద్ చీఫ్ పరారైపోయాడు.ఇప్పుడు అతనిని అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

ఇదిలా ఉంటే తాజాగా సాద్ కి సంబందించిన ఆడియో టేపులు సంచలనంగా మారాయి.

సాద్ తన ప్రసంగంలో మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే 70 వేల మంది చనిపోయారని చెబుతున్నారు.

నిజానికి వాళ్లంతా దేవదూతలుగా మారారు.ఏ డాక్టరైనా మిమ్మల్ని రక్షించగలడా? ఆ 70 వేల మంది దేవదూతలన్ని తానే సంరక్షణలోకి తీసుకున్నానని సాక్షాత్తు భగవంతుడే చెబితే ప్రపంచంలోని ఏ శక్తి అయినా వ్యతిరేకించగలదా? క్వారంటైన్ విధానం అనేది అంటరానితనం.ఇది భయాన్ని, అంటరానితనాన్ని వ్యాపించే సమయం కాదు.డాక్టర్ల మాట అసలే వినాల్సిన పనిలేదు.అన్నింటికంటే ముఖ్యంగా సామూహిక ప్రార్థనలను ఆపనే ఆపోద్దు.మనల్ని ఒక్కటిగా ఉండనీయకుండా.

కలిసి భోజం చేయనీయకుండా కుట్రలు సాగుతున్నాయి.వైరస్ లక్షణాలు కనిపించినా మీరు భయపడొద్దు.

మునుపటికంటే సామూహిక ప్రార్థనలు బలంగా చేయండి అంటూ ముస్లిం వర్గాలకి సందేశం ఇచ్చారు.ఈ సందేశంతోనే వారంతా లాక్ డౌన్ ఉన్నాకూడా గుట్టుచప్పుడు కాకుండా తమ ప్రాంతాలకి వెళ్ళిపోవడం జరిగింది అనేది చాలా మంది వాదన

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube