కరోనా ఎఫెక్ట్.. చికెన్ ధరకు రెక్కలు!

నాన్ వెజ్ ప్రియులకు ఇది చాలా బాధాకరమైన వార్తే కానీ తప్పదు.అసలే కరోనా సమయం అందులో లాక్ డౌన్ ఒకటి.

 Chicken Cost Was Peaks Now In Hyderabad  Coronavirus, Lock Down, Chicken Rates,-TeluguStop.com

ఇంకా అలాంటి ఈ లాక్ డౌన్ వేళా అందరి ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది.ఇంకా అలాంటి ఈ సమయంలో చికెన్ ధర ఎంత పెరిగిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

ఎంత అనుకుంటున్నారా? జస్ట్ 310 రూపాయిలు మాత్రమే.

ఏంటి 310 రూపాయిలు జస్ట్ ఆ? అని మీకు అనిపించచ్చు.కానీ తెలంగాణ మార్కెట్ లో చికెన్ ధర అమాంతం పెరుగుతూ వెళ్తుంది.ప్రభుత్వం కిలో చికెన్ 270 రూపాయలకు మించి అమ్మకూడదని ఆదేశించినప్పటికీ కొన్ని చోట్ల నిన్న ఆదివారం 300 నుండి 310 రూపాయలకు వరకు అమ్మినట్టు సమాచారం.

దుకాణాలకు కోళ్ల పారాల యజమానులు అవసరమైన కోళ్లను సరఫరా చేయలేకపోవడం వల్లే చికెన్ ధర పెరుగుతున్నట్టు తెలుస్తుంది.ఇంకా అది ఒక కారణం అవుతే రంజాన్ మాసం కావడంతో చికెన్ కి ఇంకాస్త డిమాండ్ పెరిగింది అని చికెన్ షాపు యజమానులు చెప్తున్నారు.

అయితే కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించినప్పుడు చికెన్ ధర 25 రూపాయలకు చేరితే.ఇప్పుడు ఏకంగా 300 చేరడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube