అక్కడ మద్యం లారీ బోల్తా.. మందుబాబులు పండగే పండగ!

సాధారణంగా ఏదైనా ఫ్రీ అంటే చాలు జనాలు ఎగబడతారు.అదే కొంచం కాస్టలీ వస్తువు అతి తక్కువ ధరకే వస్తుంది అన్న క్యూ కట్టేస్తారు.

 Locals Rush, Liquor-bottles, Liquor Bottles Truck, Kawardha, Chhattisgarh-TeluguStop.com

అలాంటిది ఎంతో కాస్టలీ అని మద్యంను లిమిట్ గా తీసుకునే వారికి మద్యం ఫ్రీగా వస్తుంది అంటే ఎగబడకుండా ఊరికే ఉంటారా? ఇంకా అలానే మద్యం లారీ బోల్తా పడటంతో మందుబాబులు అక్కడ పండగ చేసుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

చత్తీస్‌గఢ్‌లో గురువారం మద్యం బాటిళ్ల లోడుతో వెళుతోన్న ఓ లారీ బోల్తా పడింది.అది తెలిసిన జనాలు ఇదే సరైన సమయం అని అక్కడికి ఫాస్ట్ గా వెళ్లి బాటిళ్లు ఎత్తుకెళ్లిపోతున్నారు.

మద్యం లారీ బోల్తా పడిన విషయం పోలీసులకు తెలిసింది.దీంతో పోలీసులు కూడా ఫాస్ట్ గా వచ్చేశారు.

మద్యం ఎత్తుకెళ్తున్న మందుబాబులను దొరికిన వారిని దొరికినట్టు లాఠీలతో కొడుతున్నారు.అయినా సరే జనాలు అవి ఏమి పట్టించుకోకుండా వారికి కావాల్సిన వారు ఎత్తుకుపోతున్నారు.పోలీసులు కొడుతున్న సరే లాటి దెబ్బలు కూడా పూలతో కొడుతున్నట్టు అనిపించి అన్ని ఎత్తకపోతున్నారు.ఇంకా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా అది ప్రస్తుతం వైరల్ గా మారింది.కాగా ఆ లారీలో రూ.20 లక్షల వరకు సరుకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube