జనసేన-బీజేపీ కూటమికి పరీక్షగా మారిన స్థానిక ఎన్నికలు

ఏపీ రాజకీయాలలో సంప్రదాయ రాజకీయ పార్టీలకి భిన్నంగా మూడో ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్న జనసేన-బీజేపీ కూటమి తమ రాజకీయ ఉనికిని మరింత పెంచుకోవడానికి తమకున్న అన్ని దారులని వెతుకుతుంది.ప్రభుత్వ వైఫ్యలాలని ఎండగట్టడానికి ఏ ఒక్క అవకాశం వచ్చిన దానిని వదులుకోవడం లేదు.

 Local Body Elections Important For Janasena Bjp Team-TeluguStop.com

అధికార పార్టీ లోపాలని ఎత్తి చూపించడంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ముందు ఉన్నారు.వైసీపీ-టీడీపీ మధ్య కక్ష పూరిత రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి.

అయితే వాటికి విరుద్ధంగా స్పష్టమైన విదానాలతో ప్రభుత్వ వైఫల్యాల మీదనే జనసేనాని విమర్శలు ఉన్నాయి.అయితే అధికార పార్టీ వైసీపీ మాత్రం పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వస్తుంది.

ఈ నేపధ్యంలో గత అసెంబ్లీ ఎన్నికలలో జనసేన ఘోర ఓటమి తర్వాత మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి.ఈ ఎన్నికలలో జనసేన-బీజేపీ కూటమిగా కలిసి పోటీ చేయబోతున్నాయి.

గత తొమ్మిదేళ్ళ పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమకి గెలుపుని అందిస్తాయని అధికార పార్టీ భావిస్తుంది.అయితే సంక్షేమ పథకాలు అమలు చేయడంలో అధికార పార్టీ వైఫల్యాలు తమకి అనుకూలంగా మారుతాయని టీడీపీ భావిస్తుంది.

అయితే ఎన్నికలలో ఘోర ఓటమి తర్వాత వెంటనే ప్రజలలోకి వచ్చి సమస్యలపై తమదైన పోరాటం చేస్తున్న జనసేన, బీజేపీ పార్టీల పట్ల ప్రజలలో ఉన్న సానుకూలత తమకి కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ టీం భావిస్తుంది.అయితే స్థానిక ఎన్నికలు జనసేన-బీజేపీ కూటమి బలం ఎంత ఉంది, ఏ స్థాయిలో బలపడింది.2024 నాటికి వాటి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే విషయాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.మరి వీటిని జనసేన పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube