సకాలంలో తీసుకున్న అప్పులు చెల్లించాలి...!

యాదాద్రి భువనగిరి జిల్లా: ది నాగార్జున రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ లో సంఘం సభ్యులు తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించి సంఘం యొక్క అభివృద్ధికి తోడ్పడాలని సంఘం అధ్యక్షులు కంచర్ల అశోక్ రెడ్డి కోరారు.శనివారం మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన ది:నాగార్జున రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ 54వ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంఘంలో 1397 మంది రైతులు పొందిన అప్పులను సకాలంలో ఆరు మాసాలకు ఒకసారి వడ్డీ చెల్లించి రెన్యువల్ చేసుకోవాలన్నారు.జి‌ఓ నెం.44 ఉద్యోగ భద్రత వచ్చినందుకు గాను సంఘ ఉద్యోగులపై మరింత పని భాద్యత పెరిగిందని భాద్యాతాయుతంగా జవాబుదారీ తనంగా పని చేయాలని ఉద్యోగులకు సూచించారు.

 Loans Should Be Paid On Time The Nagarjuna Rythu Seva Sahakara Sangham Limited,-TeluguStop.com

సంఘంలో రైతులు పొందిన దీర్ఘకాలిక రుణములు 2022-2023 సంవత్సరానికి గాను రూ.1కోటి 90 లక్షలు వసూలు కావలసి ఉన్నట్లు తెలిపారు.రైతులలో జూన్ 30,2023 నాటికి వన్ టైం సెటిల్మెంట్ వర్తించే వారికి 35% మాఫీ వర్తిస్తుందని ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని కోరారు.అప్పులు చెల్లించనిచో వారి భూములను నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆదేశం మేరకు వేలం చేస్తారన్నారు.

ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు పెలపుడీ వెంకటేశ్వర్లు, అడ్డగూడూర్ మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ తీపిరెడ్డి మేఘారెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొనతం యాకూబ్ రెడ్డి, మోత్కూర్ మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ కొండ సోమమల్లు,సర్పంచుల పోరం అధ్యక్షులు రాంపాక నాగయ్య,డైరెక్టర్స్ సామ పద్మరెడ్డి,పురుగుల మల్లయ్య,దేవసారి రాములు,జిట్ట లక్ష్మయ్య, కారుపోతుల ముత్తయ్య, బుశిపాక సుజాత,బండ పద్మ,సంఘ కార్యదర్శి కె.వరలక్ష్మీ,సంఘ రైతులు, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube