పేటీఎంతో రూ.ల‌క్ష వ‌ర‌కు లోన్.. ఎలా అంటే?

ఇప్పుడు అంతా డిజిట‌ల్ మ‌యం అయిపోయింది.ఏది కొనాల‌న్నా.

 Paytm, Postpaid Launches, Flexible Emi Option, 1 Lakh Rupees, New Future In Payt-TeluguStop.com

ఏది అమ్మెయాల‌న్నా.పూర్తిగా ఇంట‌ర్నెట్ ద్వారానే అయిపోతుంది.

దాంతో లిక్విడ్ క్యాష్ అవ‌స‌రం రోజురోజుకు త‌గ్గుతోంది.దీంతో డిజిట‌ల్ పేమెంట్ యాప్ లు పుట్టుకొస్తునే ఉన్నాయి.

త‌మ క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ఎన్నో ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తునే ఉన్నాయి.ఈ డిజిట‌ల్ పేమెంట్ యాప్స్ లో ముఖ్యంగా పేటీఎం, ఫోన్ పే, జీపే.

ఎక్కువ మంది క‌స్ట‌మ‌ర్ల‌ను క‌లిగి ఉన్నాయి.

అయితే ఇవి ఎప్పుడూ త‌మ క‌స్ట‌మ‌ర్ల‌ను పెంచుకునేందుకు ప‌లు ఆఫ‌ర్లు తెస్తూ.

ఉంటాయి.ఇప్పుడు అందులో భాగంగా పేటీఎం త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు మంచి ఆఫ‌ర్ ను ప్ర‌క‌టిస్తోంది.

ఈ కొత్త సర్వీసుతో పేటీఎం పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు త‌మ‌ నెలవారి బిల్లును సులభంగా ఈఎంఐ రూపంలోకి మార్చుకోవ‌చ్చు.అదే కాకుండా తక్కువ వడ్డీ రేట్లతోనే ఈ బెనిఫిట్ ను పొందొచ్చని సూచిస్తోంది.

పేటీఎం పోస్ట్‌పెయిడ్ యూజర్లు బిల్ ఈఎంఐ అనే ఫీచ‌ర్ తో ఎన్నో లాభాలు పొందొచ్చ‌ని సూచిస్తోంది.దీంతో పేటీఎం క‌స్ట‌మ‌ర్లు త‌మ ఖర్చులను తక్కువ వడ్డీ రేట్లతో ఈఎంఐగా మార్చుకునే వేసులుబాటు ఉంది.

మాములుగా పేటీఎం పోస్ట్ పెయిడ్ కస్టమర్లు వాళ్ల‌కు సంబంధించిన బిల్లులు జనరేట్ అయిన వారం రోజుల్లో ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.కానీ బిల్ ఈఎంఐ ఫీచ‌ర్ తో బిల్లు మొత్తాన్ని ఈఎంఐ లోకి ఈజీగా మార్చుకోవ‌చ్చు.

Telugu Rupees, Flexible Emi, Paytm-Latest News - Telugu

దీనికి పేటీఎం పోస్ట్ పెయిడ్ తో త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు రూ.ఒక ల‌క్ష వ‌ర‌కు క్రెడిట్ లిమిట్ ను కూడా అందిస్తోంది.దీంతో పేటీఎం క‌స్ట‌మ‌ర్లు త‌మ‌కు న‌చ్చిన ప్రొడ‌క్ట‌ల‌ను కొనుగోలు చేయొచ్చిని పేటీఎం పేర్కొంది.అయితే పేటీఎం పోస్ట్ పెయిడ్ లో మూడు ర‌కాలు ఉంటాయి.అందులో మొద‌టిది పోస్ట్ పెయిడ్ లైట్ యూజ‌ర్లు.వీరికి రూ.20,000 వ‌ర‌కు క్రెడిట్ లిమిట్ ఉంటుంది.క్రెడిట్ స్కోర్ లేని వారు కూడా దీన్ని వాడుకోవ‌చ్చు.

ఇక మిగ‌తవి డిలైట్ అండ్ ఎలైట్ కస్టమర్లు.వీరు రూ.ఒక లక్ష వరకు క్రెడిట్ లిమిట్ వాడుకోవ‌చ్చ‌ని పేటీఎం పేర్కొంది.మీకు కూడా కావాల‌నుకుంటే పేటీఎం యాప్ లో ఒక లుక్ వేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube