పూరి మార్కెట్ పడిపోయిందా ?

ఈ జెనరేషన్ దర్శకులలో మొదటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ పూరి.అసలు ఎవరు ఊహించని బాక్సాఫీస్ లెక్కలు చూపించాడు పోకిరితో.

 Loafer Business Yet To Gain Pace-TeluguStop.com

ఇప్పుడు మహేష్ బాబు అనుభవిస్తున్న సూపర్ స్టార్ డంలో పూరి వలన వచ్చిన వాటా చాలా పెద్దది.అలాంటి పూరి తరువాత మాయం అయిపోయాడు.

ఇప్పుడు సినిమాలు తీస్తున్నది ఆ పూరి జగన్నాథ్ కాదేమో అన్నంతలా మారిపోయాడు.అక్కడి నుంచి చెప్పుకోదగ్గ హిట్లు అంటే వేళ్ళ మీద లేక్కపెట్టాల్సిందే.

బిజినెస్ మెన్ , గోలీమార్, హార్ట్ ఎటాక్, టెంపర్ ఫర్వాలేదు అనిపించాయి.మహేష్ కి కథ చెబితే పక్కన పెట్టాడు, మెగాస్టార్ రిజెక్ట్ చేసేసాడు.

జ్యోతిలక్ష్మి నష్టాలు తెచ్చిపెట్టింది.ఇప్పుడు లోఫర్ ను కొనేందుకు బయ్యర్లు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు.

అవును వచ్చే నెల రిలీజ్ పెట్టుకొని ఇప్పటివరకు లోఫర్ బిజినెస్ స్పీడ్ అందుకోకపోవడం కలవర పెట్టే విషయం.సినిమా అమ్ముడుపోకుండా ఆగిపోదు కాని బిజినెస్ అనుకున్నదానికి తక్కువే చేయొచ్చని ట్రేడ్ వర్గాల ఉవాచ.

దీనికి కారణం పూరి ఫామ్ అని కొందరు అంటే, లోఫర్ ట్రైలర్ బాగాలేకపోవడమని ఇంకొందరు అంటున్నారు.మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి పూరి మార్కెట్ పడిపోయింది అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube