హైదరాబాద్ లో షురూ అయిన వాట్సాప్ వ్యభిచారం

పూర్వ కాలంలో ఎవరైనా శృంగారంలో పాల్గొనాలంటే సాని కొంపలు ఉండేవి.ఇందులో విటులు ఎవరితో అయితే శృంగారం చేయాలనుకుంటున్నారో వారిని స్వయంగా ఎన్నుకునే వారు.

 Llatest News About Hyderabad-TeluguStop.com

అయితే కాలం మారే కొద్దీ ఈ సాని కొంపలు కనుమరుగై పోయాయి.అయితే అప్పుడు కనుమరుగై పోయిన సాని కొంపలు ఇప్పుడు రూపాంతరం చెంది ఇప్పుడు ఆన్ లైన్ వ్యభిచార గృహాలుగా ఏర్పడుతున్నాయి.

 అయితే తాజా సమాచారం ప్రకారం సులువుగా డబ్బు సంపాదించే మార్గాలు ఎన్నుకున్న కొంత మంది యువతులు ప్రస్తుతం వాట్సాప్ ద్వారా  ఆన్ లైన్ లో వ్యభిచారం చేస్తున్నారు.

ఎలాగంటే నగరంలో వ్యభిచారం ద్వారా డబ్బు సంపాదించాలనే యువతులు ఓ పది, పదిహేను మంది కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి ఒక ఏజెంట్ నియంనించుకుంటారు.

ఆ ఏజెంట్ ద్వారా వాట్సాప్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి తమ సమాచారాన్ని ఆ గ్రూపులో ఉంచుతారు.అనంతరం ఆ నెంబర్ ను ఏజెంట్ సామాజిక మాధ్యమాలలో తమ దగ్గర అన్ని వయసులకి సంబందించిన అమ్మయిలు, మధ్య వయస్కులు, పెళ్లి అయినవాళ్లు/కానివాళ్లు ఉన్నారని కావున కావాల్సినవారు తమని సంప్రదించాలని వాట్సాప్ నంబర్ ని పోస్ట్ చేస్తాడు.
  

Telugu Hyderabad-Latest News - Telugu

దాంతో అవసరం ఉన్న వ్యక్తులు తనకి ఫోన్ చేసి అమ్మాయిలను చూపించమంటే ఈ ఏజెంట్ తన దగ్గర ఉన్నటువంటి అమ్మాయిల ఫోటోలను నేరుగా వాట్సాప్ నంబర్ కి పంపిస్తాడు.ఆ తర్వాత ఇంకేముంది నచ్చినవాళ్ళని ఎంచుకుని వాళ్ళతో వ్యభిచారం చేయొచ్చు.ప్రస్తుతం ఈ వ్యాపారం సామాజిక మాధ్యమాల్లో, ఇంటర్ నెట్లో విచ్చలవిడిగా సాగుతోంది.ఇందులో పొట్టకూటి కోసం చేసే వాళ్ళు కొందరుంటే, జల్సాలకి అలవాటు పడి డబ్బులకోసం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు.
 

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదంతా పబ్లిక్ గానే జరుగుతోంది.అయినా కూడా సంబంధిత అధికారులు స్పందించడం లేదు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ వ్యభిచార వ్యాపారాలపై చర్యలు తీసుకోకపోతే యువత తప్పుదొవ పడుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అంతేగాక ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్తులో పెళ్లి అనే బంధానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube