మామూలుగా ప్రతి ఇంట్లో బల్లులు బెడద ఉంటుంది అన్న విషయం తెలిసిందే.గోడలకు అతుక్కొని ఉండే బల్లులు కొన్ని కొన్ని సార్లు భయపడుతుంటాయి కూడా.
అయితే ఇంట్లో ఎప్పుడూ చిరాకు తెప్పించే దోమలు బొద్దింకల బెడద ను పోగొట్టేందుకు పలు రకాల ప్రొడక్టులు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.అదే బల్లుల బెడద పోగొట్టేందుకు మాత్రం ఎలాంటిది కూడా అందుబాటులో లేదు.
దీంతో ఎక్కువ బల్లులు ఉంటే చిరాకు పడడం చేస్తూ ఉంటాము.ఇంట్లో తిరుగుతున్న బల్లులు ఎప్పుడు మనకి దగ్గర గానే ఉంటుండటం తో వాటిని చూసి భయపడటం కూడా చేస్తూ ఉంటాం.
ఈ బల్లులను తరిమికొట్టేందుకు ఏదైనా చిట్కా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటాం.ఇప్పుడు ఆ చిట్కా రానే వచ్చింది.ఈ చిన్న చిట్కా పాటిస్తే బల్లుల బెడద కు చెక్ పెట్టొచ్చు.
ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి మిక్సీలో పట్టి… వచ్చిన ఈ మిశ్రమంలో ఉల్లిపాయ పిప్ప్పి ని నీళ్ల ను వేరు చేయాలి… అందులో లవంగాలు మిరియాలు కలిపి పొడి చేయాలి … డెటాల్ సబ్బును చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్లలో కలపాలి.
డెటాల్ లిక్విడ్ అయినా వాడొచ్చు.ఓ బాటిల్లో పోసి బల్లి ఉన్న చోట స్ప్రే చేస్తే… ఆ వాసనకి బల్లుల ని బయటికి వెళ్లిపోతాయి.
ఇలా చేస్తే కొంత మేరకు బల్లుల బెడద తగ్గే అవకాశం ఉంది.