వడ సాంబార్ తిందామనుకుంటే...సాంబార్ లో ప్రత్యక్షమైన బల్లి!  

Lizard In Sambar-idly,north,roti,south,special,vada

సౌత్ స్పెషల్ టిఫిన్స్ సాంబార్ ఇడ్లి,వడ విత్ సాంబార్. అయితే ఇలాంటి టిఫిన్స్ తినడానికి నార్త్ ఇండియన్స్ కూడా ఇష్టపడుతుంటారు. ఎక్కువగా రోటీ,పరోటాలు తిని తిని వారికి ఎలాంటి రుచులు చూడాలి అంటే చాలా ఇష్టంగా ఉంటారు..

వడ సాంబార్ తిందామనుకుంటే...సాంబార్ లో ప్రత్యక్షమైన బల్లి!-Lizard In Sambar

ఈ ఉద్దేశ్యం తోనే సాంబార్ వడ తిందామని వెళ్లిన జంటకు షాకింగ్ అనుభవం ఎదురైంది. మహారాష్ట్ర లో ఉన్న హల్దీరామ్ అవుట్ లెట్ లో సర్వ్ చేసిన వడ సాంబార్ లో బల్లి ప్రత్యక్షమైంది. నాగ్పూర్ నగరంలోని అజానీ స్క్వేర్ వద్ద ఉన్న హల్దీరాం అవుట్లెట్ కు దంపతులు వచ్చి వడ సాంబారుకు ఆర్డరిచ్చారు.

అయితే వడసాంబారు తీసుకొని తాము తింటుండగా అందులో మరణించిన బల్లి కనిపించిందని వారు హల్దీరాం అవుట్లెట్ సూపర్ వైజర్ కు ఫిర్యాదు చేశారు. మరోపక్క ఈ సమాచారం అందుకున్న ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడి చేసి దానిని సీజ్ చేసినట్లు తెలుస్తుంది. సరైన నాణ్యత ప్రమాణాలు,జాగ్రత్తలు తీసుకొని కారణంగా హల్దీరాం అవుట్ లెట్ ను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

అయితే ఆ జంట మాత్రం ఈ ఘటన జరిగిన తరువాత ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స తీసుకొని గురువారం డిశ్చార్జి అయినట్లు సమాచారం.