తొండ‌ను వేటాడ‌బోయిన పాము.. కానీ చివ‌ర‌కు

జంతువులు ఏవైనా స‌రే బ‌త‌కాలంటే మ‌రో ప్రాణం తీయాల్సిందే.లేక‌పోతే మ‌నుగ‌డ క‌ష్టం.

 Lizard Fight With Snake Viral Video, Lizard, Snake, Viral Video, Snake Viral Vid-TeluguStop.com

అది అడ‌విలో ఉండే జంతువులు అయినా లేదంటే మాన‌వ స‌మాజంలో ఉండే స‌రీసృపాలు అయినా స‌రే నిత్యం పోరాడుతూనే ఉండాలి.ఏదో ఒక ప్రాణం తీయ‌క‌పోతే త‌మ ప్రాణాలు నిల‌బ‌డ‌వు.

అందుకే అవ‌న్నీ నిత్యం ప్రాణాల‌తో యుద్ధం చేస్తూనే ఉంటాయి.ఇక పాముల విష‌యం కూడా ఇలాగే ఉంటుంది.

అవి బ‌త‌కాల‌న్నా స‌రే ఇత‌ర జంతువుల‌ను నిత్యం వేటాడుతూనే ఉంటాయి.స‌రీసృపాల్లో పాములు చాలా పెద్దవి.

ఇవి త‌మ‌కంటే చిన్న వాటినే తింటుంటాయి.
ముఖ్యంగా పాముల వేటాడేది ఎలుక‌లు లేదంటే తొండ‌ల‌ను అన్న విష‌యం తెలిసిందే.

ఇంకొన్ని సార్లు నీటిలోని చేప‌ల‌ను కూడా వేటాడుతాయి.ఇక పాముల వేట‌ల‌కు సంబంధించిన వీడియోలు కూడా నిత్యం వైర‌ల్ అవుతూనే ఉంటాయి.

ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒక‌టి బాగా వైర‌ల్ అవుతోంది.దాన్ని చూసిన వారంతా కూడా షాక్ అయిపోతున్నారు.

ఎందుకంటే వేట అన్న త‌ర్వాత ప్ర‌తి సారి స‌క్సెస్ కాదు క‌దా.కొన్ని సార్లు తిర‌గ‌బ‌డ‌టం కూడా జ‌రుగుతుంది.

ఇప్పుడు కూడా ఓ పాముకు ఇలాంటి ఘ‌ట‌నే ఎదురైంది.ఈ వైర‌ల్ వీడియోలో అది మ‌నం చూడొచ్చు.

ఇందులో ఓ పాము గోడపై పాకుతూ ఓ తొండ‌ను వేటాడేందుకు చూస్తుంది.అప్ప‌టికే అక్క‌డ రెండు తొండ‌లు తిరుగుతున్నట్లు మ‌నకు క‌నిపిస్తుంది.అయితే ఓ తొండ‌ను ఎంతో చాక‌చ‌క్యంగా పాము వెంటాడి వేటాడుతుంది.ఇక పాము చెర నుంచి త‌ప్పించుకునేందుకు ఆ తొండ ఎంత‌లా ప్ర‌య‌త్నించినా పెద్ద‌గా ఫ‌లించ‌దు.అయితే అక్కడే తిరుగుతున్న మ‌రో తొండ వెంట‌నే పాము మీద దాడిచేస్తుంది.ఆ దాడికి పాము విల‌విల‌లాడిపోతుంది.

ఇంకేముంది ఆ తొండ‌ను అక్క‌డే వ‌దిలేసి జారుకునే ప్రయత్నం చేస్తుంటుంది.మొత్తానికి ఓ తొండ మ‌రో ప్రాణం కాపాడింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube