బల్లి అక్కడ పడితే ఏమవుతుందో తెలుసా ? ఆడవారి కడుపు పైన పడితే ఏమవుతుంది..     2018-06-20   00:47:57  IST  Raghu V

బల్లి శరీరంపై పడితే ఏమవుతుందో అని మనలో చాలా మంది ఆందోళనపడుతుంటారు. బల్లిశాస్త్రంపై అవగాహన లేక ఏం చెయ్యాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు. అయితే బల్లి మన శరీరంపై ఎక్కడ పడినప్పటికీ వెంటనే తలస్నానం చేసి, దీపం పెట్టి, నైవేద్యంతో ఇష్ట దైవమును ప్రార్థించాలి. బల్లి లేదా తొండ తల మీద నుంచి కిందకు దిగితే మంచిది కాదు. కింద నుంచి పైకి పాకి వెంటనే దిగితే మంచిది. శరీరంపై కొన్ని ప్రత్యేక స్థానాల్లో బల్లి పడటం వల్ల కొన్ని రకాల ఫలితాలు కలుగుతాయి. అలాగే కొన్ని రకాల నష్టాలు కూడా కలుగుతాయి.అవేంటో చూద్దాం

మగవారి మీసాల పైన పడితే

వేళ్ళపై పడితే అనుకోకుండా బంధువులు, స్నేహితుల రాక, కుడి భుజంపై పడితే కష్టాలు, సమస్యలు. ఎడమ భుజం పదిమందిలో అవమానం జరుగుతుంది. తొడలపై పడితే దుస్తులు, వస్త్రాలు నాశనమవుతాయి. మీసాలపై పడితే కష్టాలు వెంటాడుతాయి. కాలి వేళ్ళపై అయితే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. పాదములపై అయితే ప్రయాణానికి సిద్ధం అని అర్థం. ఇవన్నీ పురుషులపై బల్లి పడితే కలిగే విషయాలు.

పెదవుల పైన పడితే

కుడి చెంపపై పడితే బాధలు ఎక్కువవుతాయి. ఎడమ చెవిపై పడితే ఆదాయం బాగా వస్తుంది. పైపెదవి అయితే కలహాలు వెంట పడతాయి. కింది పెదవి ఆదాయంలో లాభం కలుగుతుంది. రెండు పెదవుల మధ్య పడితే మృత్యువు సంభవిస్తుంది. వీపుపై ఎడమ భాగం విజయం కలుగుతుంది. మణికట్టు అలంకార ప్రాప్తి కలుగుతుంది. మోచేయి డబ్బు నష్టం.

మగవారి తల పైన పడితే

మగవారి తలపై బల్లి పడితే మరణం వెంటాడుతుందని సంకేతం. ముఖంపై పడితే ఆర్థిక సమస్యల నుంచి బయట పడి లాభాల బారిన పడతారు. ఎడమ కన్నుపై పడితే అంతా శుభమే జరుగుతుంది. కుడి కన్నుపై పడితే చేసే పని విజయవంతం కాదు. అపజయం కలుగుతుంది. నుదురుపై పడితే ఇతర సమస్యలు రావడం, విడిపోవడం లాంటివి జరుగుతుంది.