తింటున్న సాంబారులో సగం బల్లి ప్రత్యక్షం... మిగితా సగం ఎక్కడ..?

ప్రస్తుతం ఈ కరోనా కాలంలో హోటల్లు తెరవడమే గగనమైపోయింది.ఒకవేళ తెరిచిన హోటళ్లలో తినడానికి ప్రజలు పరిపరి విధాలా ఆలోచన చేస్తున్నారు.

 Lizard, Delhi, Hotel, Police, Tiffen, Dosa, Sambar-TeluguStop.com

ఎందుకంటే కరోనా ఎవరికి ఉంటుందో మనకు తెలియదు .ఈ కరోనా మహమ్మారి మనకు అంటుకుంటుందేమో అని మన భయము.కానీ, కొన్ని పరిస్థితులలో హోటళ్లలో తప్పనిసరిగా తినవలసి వస్తుంది.అది ఎలా అంటే వేరే ఊరికి వెళ్ళినప్పుడు మనము భోజనం కోసం కానీ, టిఫిన్ కోసం కానీ ఖచ్చితముగా హోటల్ కి పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.

అటువంటి పరిస్థితులే ఇప్పుడు కొన్ని కారణాలకు మూలంగా మారుతున్నాయి.

తాజాగా ఒక వ్యక్తి కి చేదు అనుభవం హోటల్ లో ఎదురయింది.

అది ఏమిటంటే… పంకజ్ అనే ఒక వ్యక్తి తన మిత్రులతో కలసి డిల్లీలో ఒక హోటల్ కు వెళ్లారు.ఎవరికి వాళ్ళు కావలసినది ఆర్డర్ చేశారు.పంకజ్ మాత్రం దోస, సాంబారు తింటుండగా అతనికి ఒక చేదు అనుభవం ఎదురయింది.అదేంటంటే… తాను తింటున్న సాంబార్ లో ఒక బల్లి కనిపించింది.అది కూడా సగం బల్లి మాత్రమే కనిపించింది.మిగితా సగం బల్లి తాను తిన్నానేమో అని అతనికి భయము పట్టుకుంది.లేకపోతే వేరే వాళ్లకు వెళ్ళిపోయిందా, లేదా సాంబార్ గిన్నెలోనే ఉంది పోయిందా…! అని ఆ పంకజ్ లబోదిబో అని మొత్తుకుంటున్నాడు.ఈ సంఘటన ఢిల్లీలో ఒక పేరు మోసిన ప్రముఖ హోటల్లో జరిగింది.

అదికూడా దక్షిణాది రాష్ట్రాలకు అనేక రుచులను అందించే ప్రసిద్ధి గాంచిన హోటల్.సాంబార్ లో బల్లి ని ఆ కస్టమరు ఆ హోటల్ యజమాని పిలిపించి తనకు వచ్చిన సగం బల్లిని చూపించాడు.

మిగితా ఆ సగం బల్లి ని ఎక్కడ కనిపించలేదు.

చివరకు, పంకజ్ హోటల్ యజమాని పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ బల్లి వార్త వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పంకజ్ హోటలు యజమానిపై అలాగే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పై విరుచుక పడి నానా రచ్చ చేశాడు.

కిచెన్ లోకి వెళ్లి అక్కడ ఉన్న దోస పిండిని, మిగితా సాంబార్ అన్నింటినీ నిశితంగా పరిశీలించాడు.కానీ, ఎక్కడ వెదికినా ఆ సగము బల్లి మాత్రము కనిపించలేదు.

అక్కడ ఉన్న సిబ్బందిని మీరు ఏమేమి వాడుతారు అని తెలుసుకొని, వాటిని చూపించమని చాలాసేపు సగము బల్లి కోసము వెతికినా ప్రయోజనము లేకపోయింది.బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు యజమానిని వంటగది తో పాటు , హోటల్ మొత్తం లో ఉన్న సిసి ఫుటేజీ లను మాకు ఇవ్వవలసినదిగా కోరారు.ఇటువంటి సంఘటనలు జరిగితే హోటలు కు వెళ్లాలంటే ప్రజలు చాలా భయపడ వలసి వస్తున్నది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube