లిఫ్ట్ లో బొమ్మ తాడుకు హ్యాంగ్ అయిన బాలుడు,తెలివిగా వ్యవహరించిన అక్క!

పెద్ద వాళ్లు తోడు లేకుండా పిల్లలను ఎక్కడైనా ఒంటరి గా వదలకూడదు అన్న దానికి ఈ తాజాగా సంఘటన ఉదాహరణ గా చెప్పాలి.ఈ ఘటన ఇస్తాంబుల్ లో చోటుచేసుకుంది.

 Little Girlsaves 5 Yearold Brother-TeluguStop.com

ఒక చిన్నారి తన సమయస్ఫూర్తి తో తన తమ్ముడి ప్రాణాలను కాపాడుకోగలిగింది.వివరాల్లో కి వెళితే…… ఐదేళ్ల బాలుడు తన అక్క,చెల్లితో కలిసి అపార్ట్మెంట్ లోని లిఫ్ట్ వద్దకు వచ్చాడు.

అయితే ఆ బాలుడు తన వెంట ఒక బొమ్మను కూడా తీసుకొని లిఫ్ట్ వద్ద నిలుచున్నాడు.లిఫ్ట్ రావడం తో హడావిడి లో లిఫ్ట్ ఎక్కిన ఆబాలుడు తన బొమ్మ లాగే తాడును కూడా మేడలో వేసుకొని ఎక్కాడు.

అయితే ఈ హడావిడి లో ఆ బొమ్మ బయట ఉండగానే లిఫ్ట్ దోర్ మూసుకుపోయింది.అయితే దీనిని గమనించుకోక కిందకు వెళ్ళడానికి లిఫ్ట్ బటన్ ప్రెస్ చేయడం తో లిఫ్ట్ మూవ్ అయ్యింది.

లిఫ్ట్ మూవ్ అవుతున్న సమయంలో తాడు మెల్లగా పైకి లెగవడం తో పిల్లాడు కూడా ఆ తాడుపై హ్యాంగ్ అయ్యాడు.అంతే ఒక్కసారిగా ఈ పరిణామాన్ని గమనించిన బాలుడి అక్క వెంటనే లిఫ్ట్ ఆఫ్ చేసి,అలారం బటన్ నొక్కి,మరోపక్క ఈ లోపు తమ్ముడికి ఎలాంటి ప్రమాదం జరగకుండా తమ్ముడి కాళ్లు పట్టుకొని నిదానంగా మెడలో బిగుసుకున్న తాడును లాగేసింది.

దీనితో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది ఆ బాలుడికి.

కాగా ఆ లిఫ్ట్ సీసీ కెమెరాలో ఇదంతా రికార్డు కాగా ఇప్పుడు నెట్టింట్లో ఈ వీడియో వైరల్ అవుతోంది.

నెటిజన్లు ఆ చిన్నారి సమయస్ఫూర్తికి తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.నిజంగా ఆ చిన్నారి సమయస్ఫూర్తి తో వ్యవహరించ బట్టి ఆ బాలుడు ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడగలిగాడు.

అందుకే ఎప్పుడూ కూడా పిల్లలను ఒంటరిగా వదలకూడదు అని పెద్దలు అంటూ ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube