మేకతో కుంగ్ ఫూ ఫైట్ చేసిన చిన్నారి....వీడియో వైరల్....

చిన్నపిల్లలు ఉండే ప్రతి ఇంట్లో వారిని తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.చిన్నపిల్లలు ఇంట్లో కుదురుగా ఒక్కచోట అసలు ఉండరు.

 Little Girl Who Fought Kung Fu With A Goat Video Viral , Childhood, Kung Fu Fig-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే పెంపుడు జంతువులు ఉండే ఇండ్లలో ఉండే పిల్లలు వాటితో ఆడుకుంటూ ఇంకా ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటారు.పెంపుడు జంతువులతో ఎంతో ఆనందంగా, సంబరంగా ఆడుకుంటూ సంతోషంగా ఉంటారు.

అవి కూడా చిన్నారులతో కలిసి పోయి సరదాగా ఆడుకుంటుంటాయి.సాధారణంగా బాల్యంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి పనులు చేసే ఉంటారు.

బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మరవలేనివి.అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం ఓ మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుంది.

చిన్న వయసులోనీ కొంతమంది పిల్లలు చేసిన పనులు, ఆడుకున్న ఆటలు వంటివి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ వైరల్ గా మారింది.

పిల్లలు చాలా అల్లరి చేస్తుంటారు.రోజంతా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు.కొన్ని సార్లు వస్తువులను బయట విసిరేస్తే, మరికొన్ని సార్లు ఇంట్లోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా చేస్తారు.ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఓ పిల్లవాడు పెంపుడు జంతువుతో కుంగ్ ఫూ ఫైట్ చేస్తూ ఉన్నాడు.

ఈ వీడియోలో చిన్నారి మేక ముందు కుంగ్-ఫూ ఫైట్ చేస్తున్నాడు.ఇలా రెండు మూడు సార్లు చేసిన తర్వాత మేకకు పట్టరాని కోపం వచ్చింది.

అతడు చేసే పనికి చిర్రెత్తి తలతో పిల్లవాడిని కొడుతుంది.దీంతో అతను కింద పడిపోతాడు.ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది.ఇది చూసిన తర్వాత మీరు కచ్చితంగా నవ్వకుండా ఉండలేరు.5 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 48 వేలకు పైగా ప్రజలు చూశారు.వందలాది మంది వీడియోను లైక్ చేశారు.

వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు.కామెంట్‌లో నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశారు.

ఇలాంటి పెంపుడు జంతువులకు చిన్న పిల్లలను దూరంగా ఉంచాలని కూడా కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube