కూతురుకు క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చిన తల్లి,చెత్త గిఫ్ట్ అంటూ నెటిజన్ల విమర్శలు

క్రిస్మస్ అనగానే పిల్లలకు ఎక్కువగా గుర్తుకు వచ్చేది శాంటా, ఎందుకంటే శాంటా వస్తాడు గిఫ్ట్స్ ఇస్తాడు అని పిల్లలు చాలా నమ్ముతూ ఉంటారు.అయితే శాంటా విషయంలో ఎంతగా ఎదురుచూస్తారో అలానే తమ తల్లి దండ్రులు ఇచ్చే గిఫ్ట్స్ కోసం కూడా అలానే ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు.

 Little Girl Very Excited To Get A Banana Gift For Xmas-TeluguStop.com

అయితే ఈ క్రమంలోనే ఒక తల్లి తన రెండేళ్ల కూతురికి ఒక గిఫ్ట్ ఇచ్చింది.యూట్యూబర్‌ జస్టిస్‌ మొజికా తన రెండేళ్ల కూతురితో ప్రాంక్‌ వీడియో చేద్దామనుకుని, క్రిస్మస్ సందర్భంగా ఒక గిఫ్ట్ ఇవ్వడానికి ప్లాం చేసింది.

దీనితో ఒకటి గిఫ్ట్ ప్యాక్ చేసి తీసుకొని కూతురుకి ఇచ్చింది.దీనితో ఆత్రంగా ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేసి ఆత్రంగా చూసింది.

ఇంతకీ ఆ గిఫ్ట్ బాక్స్ లో ఏముందో తెలుసా.బనానా , ఆ చిన్నారి కి ఆ తల్లి ఇచ్చిన గిఫ్ట్ బనానా.అది ఓపెన్ చేసిన చిన్నారి ‘బనానా బనానా’ అంటూ ముద్దు ముద్దు మాటలతో ఏంతో మురిసిపోయి తల్లి ఇచ్చిన గిఫ్ట్‌ను ఎంతో ఆనందంగా స్వీకరించింది.ఆ బనానా ని చూసి మురిసిపోతూ అరటిపండు ఒలిచి ఇవ్వమని తన తల్లిని అడిగింది.

ఎంతో ఆనందంగా ఆ బనానాను చిన్నారి ఆరగించింది.అయితే ఆ వీడియో కాస్త సోషల్ మీడియా లో షేర్ చేయడం తో ఇప్పుడు ఆ వీడియోకు 20 మిలియన్ల వ్యూస్ దక్కాయి.

అంతమంది నెటిజన్స్ ఈ వీడియో ను చూసి లైక్ చేసి షేర్ చేస్తున్నారు.ఆ వీడియోను చూసిన నెటిజన్లు కొందరు అయితే కూతురికి తల్లి ఒక చెత్త గిఫ్ట్ ఇచ్చింది అని కామెంట్ చేస్తుంటే, మరికొందరు అయితే ఆ తల్లి ఇచ్చిన గిఫ్ట్ చూసిన ఆ చిన్నారి కళ్లలో ఆనందం చూసి మురిసిపోతున్నారు.మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube