సాధారణంగా చిన్నపిల్లలు ఖరీదైన వస్తువులు ఇవ్వాలని కోరితే ఇవ్వడానికి పెద్దవాళ్లు ఇష్టపడరనే సంగతి తెలిసిందే.ఒక చిన్నారి తన ఆంటీని ల్యాప్ టాప్ ఇవ్వాలని అడగగా ఆమె ల్యాప్ టాప్ ఇవ్వడానికి నిరాకరించింది.
అత్తయ్య ల్యాప్ టాప్ ఇవ్వలేదనే కోపంతో ఆ చిన్నారి సొంతంగా ల్యాప్ టాప్( laptop ) ను తయారు చేయాలని నిర్ణయం తీసుకుని హ్యాండ్ మేడ్ ల్యాప్ టాప్ ను తయారు చేయడం గమనార్హం.మేనకోడలు చేసిన పనికి ఫిదా అయిన నేహ తన మేనకోడలి గొప్పదనం గురించి సోషల్ మీడియా( Social media ) వేదికగా షేర్ చేశారు.
మేనకోడలు తయారు చేసిన ఫోటోలను చూపిస్తూ నా మేనకోడలు నన్ను ల్యాప్ టాప్ కావాలని అడిగిందని నేను నిరాకరించడంతో మూడు గంటల పాటు కష్టపడి ల్యాప్ టాప్ తయరు చేసుకుందని ఆమె చెప్పుకొచ్చారు.చిన్న వయస్సులోనే ఇంత టాలెంటా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ హోమ్ మేడ్ ల్యాప్ టాప్ లో వేర్వేరు ఆప్షన్లు కనిపిస్తుండగా ఈ వీడియోకు 2,52,000 వ్యూస్ వచ్చాయి.ఒక యూజర్ స్పందిస్తూ ఈ ల్యాప్ టాప్ ఉత్తమమైనదని విండోస్( Windows ) ఎప్పటికీ స్థిరంగా ఉంటాయని రాయగా ఈ ల్యాప్ టాప్ కీబోర్డ్ లో ఎక్కువ ఆప్షన్లు ఉంటాయని ఇది ఖచ్చితంగా మెరుగ్గా పని చేస్తుందని కామెంట్లు చేశారు.చిన్నారి మొండి ఘటం అని మరి కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పుడు మీరు ఆమె ల్యాప్ టాప్ ను అడగాల్సి వస్తుందేమో అని మరో యూజర్ కామెంట్ చేశారు.చిన్నారి టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చిన్నారి ఐడియాలు మాత్రం బ్రిలియంట్ అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
భవిష్యత్తులో ఈ చిన్నారి సైంటిస్ట్ అవుతుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.