ఇదేందయ్యా ఇది: నెల రోజులుగా వాటిని తింటూ బతికేస్తున్న వ్యక్తి..!

మనుషులు తాము బతికేందుకు రకరకాల పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, దినుసులు లాంటివి రోజు వారి జీవితంలో వినియోగిస్తూ ఉంటారు.అయితే ఏవి తిన్నా సునాయాసంగా అరిగి పోతుంటాయి.

 Lithuania Man Eating Nuts And Bolts Since A Month, Viral Latest, Viral News, Soc-TeluguStop.com

అరిగిపోయే వాటినే మనం కూడా తింటూ ఉంటాం.ఎవరో చెప్పారని, ఎవరో పొగిడారని అరగని వస్తువులు తినము కదా .ఒకవేళ అలా తిన్నా, అది కూడా నెలరోజుల పాటు తింటే ఏమవుతుందో ఈ వ్యక్తిని చూస్తే అర్థమవుతుంది …

లిథువేనియాకు చెందిన ఓ వ్యక్తి తన మిత్రులు ‘ వీడు మేకులు తిని కూడా అరగదీసుకుంటాడు రా’ అని మునగ చెట్టు ఎక్కించారేమో గాని నిజంగానే మేకులు, వాటితో పాటు బోల్టులు, స్క్రూలు, నట్లు కూడా తినేసాడు.ఇలాగే ఒక నెలపాటు అన్నం తినకుండా మేకులు, బోల్టులు, స్క్రూలు తినేశాడు.

అయితే ఒకానొక రోజు కడుపు నొప్పి అంటూ స్థానికంగా ఉన్న పోర్ట్ సిటీ ఆస్పత్రిలో చేరాడు.పరీక్షించిన వైద్యులు అతని కడుపు నొప్పికి కారణం ఏంటో తెలుసుకోవాలని ఎక్స్ రే తీయించారు.

ఎక్స్ రే లో అన్ని మేకులు, బోల్టులు, నట్లే కనిపించాయి.దీంతో వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.మళ్లీ ఒకసారి నిర్ధారించుకునేందుకు రెండోసారి కూడా ఎక్స్ రే తీశారు.రెండవసారి కూడా అవే కనిపించాయి.

దీంతో నిజంగానే కడుపులో మేకులు, నట్లు, బోల్ట్ లు ఉన్నాయని గుర్తించారు.వెంటనే ఆలస్యం చేయకుండా ఆపరేషన్ చేసి వాటిని తీసేశారు.

Telugu Doctors, Nuts Bolts, Lithuania, Nuts Blots, Latest, Ray-Latest News - Tel

అయితే కడుపులో నుంచి కేజీ పైనే నట్లు బోల్టులు, స్క్రూలు లాంటి మెటల్స్ ను బయటకు తీయడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు.ఎందుకు ఇలా చేసావని ఆస్పత్రి వైద్యులు ఆ వ్యక్తిని అడగగా తాను నెలరోజులుగా తిండి తిప్పలు మానేసి బోల్టులే తింటున్నానని చెప్పుకొచ్చాడు.అయితే డాక్టర్లు కూడా తాను ఏదో మిత్రులతో చేసిన ఛాలెంజ్ అయ్యి ఉంటుందని అనుకున్నారు.అయితే నెలరోజులుగా కడుపులో మేకులు ఉన్నా అతని శరీరానికి ఏమీ కాకుండా కడుపులోని భాగాలకి ఎటువంటి డ్యామేజ్ జరగకపోవడంతో వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు.

నిజంగా మేకులు అరిగించుకోకపోయినా వాటిని తట్టుకునే శక్తి ఆ వ్యక్తికి ఉందని డాక్టర్లు నిర్ధారించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube