కేసీఆర్ పుట్టిన రోజున హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు వింటే.. ?

తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీయార్ జన్మదిన వేడుకలు అట్టహసంగా నిర్వహిస్తున్నారు.ఈ సంధర్భంగా పార్టీలో పండుగ సందడి నెలకొంది.

 Listening To The Comments Made By Harish Rao On Kcr Birthday Telangana, Cm Kcr,-TeluguStop.com

ఈ నేపధ్యంలో మంత్రి హరీశ్ రావు, కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తూ ఆయన గురించి చేసిన వర్ణన గులాభి నాయకుల్లో ఉత్సాహన్ని నింపుతుందట.

మామ పుట్టిన రోజున మేనల్లుడు మాట్లాడిన మాటలు ఏంటంటే.

మామగారు మీరు కారణజన్ములు.మీ జన్మదినం తెలంగాణకు పండుగ రోజు తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నది.

అంటూ మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని వైరైటీగా చెప్పారట హరీష్ రావు.

అంతే కాదండి తన మేనమామను ఆకాశానికి ఎత్తేస్తూ దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల మీ వల్లే నెరవేరింది.భావి తరాల బంగారు తెలంగాణ మీ వల్లే సాధ్యమవుతుంది.మీరు ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ తలరాత మారింది.మీ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది.గత కాలపు వెతలన్నీ తీరి ఇంటింటా సంతోషం వెల్లివిరుస్తున్నది.

మీరు ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టం అంటూ చెప్పుకొచ్చారట.నిజమే హరీష్ రావు మాటల్లో ఉన్నదంతా అని అనుకుంటున్నారట ప్రజలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube