కుక్కల లైబ్రరీ విన్నారా? అవి కుక్కలు కోసం మాత్రమే!

కుక్కల లైబ్రరీ ఏమిటి? కుక్కలేమైనా చదువుతాయా, పెడతాయా? అని అనుకుంటున్నారు కదూ.అక్కడే వుంది అసలు కిటుకు.

 Listen To The Dog Library They Are For Dogs Only , Dogs Library , Dogs , Viral L-TeluguStop.com

వినడానికి కాస్త ఆశ్చ‌ర్యంగా ఉన్నా, ఇది నిజం.అయితే ఇలాంటి కుక్కల లైబ్రరీలు మనదగ్గర లేవు సుమా.

ఆ స్టోరీ ఏమిటో తెలియాలంటే మీరు ఈ కధనం వినాల్సిందే.అమెరికాకి చెందిన ఓ నెటిజన్ కుక్కల ప్రేమికుడు.దాంతో కుక్కల కోసం ప్రత్యేకంగా ఓ లైబ్రరీని తయారు చేశాడు.‘టోబి ది డాగ్’ అనే ప్రొఫైల్ ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేసిన‌ ఈ పోస్ట్ ఒక చెక్క పెట్టెలో చిన్న లైబ్రరీ ఫోటోను కూడా చూపిస్తుంది.తీక్షణంగా చూడండి.

అయితే ఈ కుక్కల లైబ్రరీలో ఏముంటుందనే డౌట్ అందరికీ వస్తుంది కదా.అక్కడికే వస్తున్నా.ఇక్కడ పోస్టులో కనబడుతున్న ఫొటోలోని వున్న ఆ కుక్కల లైబ్రరీలో కొన్ని బొమ్మలను మనం చూడవచ్చు.

పోస్ట్ పెట్టిన మన కుక్కల ప్రేమికుడు “మా పరిసరాల కోసం కుక్కల లైబ్రరీని తయారు చేసాము.కానీ పుస్తకాలకు బదులుగా, అది బొమ్మలు, కర్రలతో నిండి ఉంటుంది.అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అని దాని ప్ర‌త్యేక‌త‌లు కాస్త వివరించాడు.

ఇకపోతే, ఇక్కడ లైబ్రరీపై ఒక చిన్న సంకేతం కూడా మీరు గమనించవచ్చు.“ఒకటి తీసుకోండి, ఒకటి వదిలివేయండి” అని రాసి ఉంది.నిజంగా, కుక్క‌లకున్న చాలా అలవాట్ల‌లో ఇదొకటి.ఈ లైబ్ర‌రీ వాటికి తప్పక ఆనందాన్ని ఇస్తుందని మనోడు నమ్మాడు.ఇది అల‌వాటు చేయ‌గ‌లిగితే, ఈ లైబ్ర‌రీ ఒక ట్రెండ్ సెట్ట‌ర్ అవుతుంది.ఇక‌, ఈ పోస్ట్‌కి 20వేలకు పైగా లైక్‌లు, టన్నుల కొద్దీ స్పందనలు వచ్చాయి.

ప్రజలు ఈ క్యూట్ లైబ్రరీకి బాధ్యత వహించే డాగ్గో ‘లైబ్రేరియన్‌’ను కూడా ప్ర‌శంసించారు.చాలా మంది తమ ఫర్‌బేబీలతో ప్రత్యేక లైబ్రరీని సందర్శించాలని అనుకుంటున్న‌ట్లు చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube