జూన్ లో సినిమాల జాతర.. వరుసగా ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయో తెలిస్తే షాకే!

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత ఒక్కొక్క సినిమా థియేటర్లలో విడుదల అవుతూ వచ్చాయి.ఈ కరుణ మహమ్మారి వల్ల ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న సినిమాలు కూడా ఉన్నాయి థియేటర్లలో విడుదల అయిన విషయం తెలిసిందే.

 List Upcoming New Telugu Movies Releases June Last Week, Tollywood, Virataparvam-TeluguStop.com

అయితే నిన్నమొన్నటిదాకా థియేటర్లలో భారీ బడ్జెట్ సినిమాలు ఏ రేంజ్ లో హంగామా సృష్టించాయో మనందరికీ తెలిసిందే.కరోనా మహమ్మారి వల్ల వెలవెలబోయిన థియేటర్లకు జనాలు భారీగా తరలి రావడంతో థియేటర్లు కళకళలాడాయి.

దీంతో అప్పటి వరకు రిలీజ్ చేయాలా వద్దా అనుకున్న సినిమాలు అన్నీ కూడా విడుదల చేశారు.ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు విడుదల అయి బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైన విషయం తెలిసిందే.

మరికొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.ఇది ఇలా ఉంటే ఇదే హుషారుతో దర్శకనిర్మాతలు జూన్ నెలలో కూడా బోలెడని సినిమాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇప్పటికే జూన్‌ 3న సౌత్‌లో రిలీజైన రెండు సినిమాలు మేజర్‌, విక్రమ్‌, పృథ్వీరాజ్‌ మంచి హిట్లుగా నిలిచాయి.మరి ఈ సినిమాలే కాకుండా జూన్ నెలలో ఇంకా ఏఏ సినిమాలు రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ క్రమంలోనే జూన్‌ 10న అంటే సుందరానికీ సురాపానం, జరిగిన కథ,777 చార్లీ,జురాసిక్‌ వరల్డ్‌ డొమీనియన్‌ సినిమాలు రిలీజవుతున్నాయి.ఆ తరువాత జూన్ 17వ తేదీన గాడ్సే ,విరాటపర్వం, కన్నడ డబ్బింగ్‌ మూవీ కే3, కీర్తి సురేశ్‌ వాశి,కిరోసిన్‌ లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఇక ఇవన్నీ ఒక ఎత్తయితే జూన్‌ చివరి వారంలో రిలీజవుతున్న సినిమాలు మరో ఎత్తు అని చెప్పవచ్చు.

Telugu June, Surapanam, Tollywood, Virataparvam-Movie

జూన్‌ ఆఖరి వారంలో ఏకంగా 9 సినిమాలు విడుదల కాబోతున్నాయి.జూన్‌ 23న కొండా, 24న సమ్మతమే,7 డేస్‌ 6 నైట్స్‌,ఒక పథకం ప్రకారం, గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు, 10th క్లాస్‌ డైరీస్‌, సదా నన్ను నడిపే, సాఫ్ట్‌వేర్‌ బ్లూస్‌ సినిమాలు థియేటర్లలో సందడి సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి.కేవలం ఈ సినిమాలు మాత్రమే కాకుండా మరికొన్ని చిన్న చిన్న సినిమాలు కూడా జూన్ నెలలో వారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.

మరి ప్రేక్షకులు ఈ సినిమాలలో ఏ సినిమాలకు జై కొడతారనేది చూడాలి మరి.అలాగే జూన్ నెలలో విడుదల కానున్న ఈ సినిమాలో ఇంకా ఏ ఏ సినిమాలు విజయం సాధిస్తాయి ఏఏ సినిమాలు పరాజయం పాలవుతాయి తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube