వైరల్.. వీళ్ళ పెళ్ళికి వెళ్లాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందేనట..!

మనం సాధారణంగా పెళ్ళికి అతిధులను పిలవాలంటే ఖచ్చితంగా శుభలేఖలు ముద్రించి వాళ్ళను సాదరంగా ఆహ్వానిస్తాం.పెళ్ళికి తప్పకుండ కుటుంబ సమేతంగా రావాలని చెబుతుంటాం.

 List Of Wedding Rules Made For Guests Go Viral, List Of Wedding Rules Made For G-TeluguStop.com

కానీ వాళ్లకు పెళ్ళికి రావాలంటే కండీషన్స్ పెట్టము కదా.కానీ ఒక జంట మాత్రం ఇందుకు విరుద్ధంగా చేస్తున్నారు.వాళ్ళ పెళ్ళికి పిలవాల్సిన ఆహ్వాన పత్రికపై వింత కండీషన్స్ పెట్టారు.

అతిధులు వచ్చి కొత్త జంటను ఆశీర్వదిస్తే చాలని అనుకుంటాం.

కానీ వాళ్ళు మాత్రం పెళ్ళికి రావాలంటే ఈ కండీషన్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాలని చెబుతున్నారు.పెళ్లి శుభలేఖలో ఆ కండీషన్స్ రాసి మరి ఆహ్వాన పత్రికను అందరికి పంపారు.

ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ పెళ్లి పత్రిక చుసిన నెటిజెన్స్ అందరు నోర్లు వెళ్లబెడుతున్నారు.

ఈ వింత పెళ్లి పత్రిక కాస్తా వైరల్ అవ్వడంతో ఇందులో ఉన్న నిబంధనలు చదివిన వారు ఇలాంటి నిబంధనలు కూడా పెడతారా అని మాట్లాడు కుంటున్నారు.అంత షాక్ అయ్యే నిబంధనలు ఏమిటా అని అనుకుంటున్నారా.

అవి వింటే మీరు నిజంగానే షాక్ అవ్వాల్సిందే.

Telugu Gift, List-Latest News - Telugu

ఆ రూల్స్ ఏంటంటే.ఈ పెళ్ళికి 30 నిముషాల ముందే రావాలని ఫస్ట్ కండీషన్ పెట్టారు.వైట్, క్రీమ్ కలర్ బట్టలు పెళ్ళికి వేసుకోకూడదట.

ఆ తర్వాత రకరకాల హెయిర్ స్టయిల్స్ లో రాకూడదట.పెళ్లి వీడియోను కూడా రికార్డ్ చేయకూడదట.అంతేకాదు మేకప్ ఎక్కువుగా వేసుకోకూడదు.పేస్ బుక్ కూడా చూడకూడదట.

అంతకు మించి 75 డాలర్ల కన్నా ఎక్కువ విలువ ఉండే గిఫ్ట్ తీసుకురావాలని పెళ్లి పత్రికలో నిబంధనలు పెట్టారు.విన్నారుగా ఇలాంటి నిబంధనలు ఎవరైనా పెళ్లి పత్రికలో రాస్తారా.

ఈ పెళ్లి కార్డు చూసి నెటిజెన్స్ కూడా వింత వింతగా కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube