శోభన్ బాబు రిజెక్ట్ చేసిన ఈ బ్లాక్ బస్టర్ సినిమాలు తెలిస్తే మైండ్ బ్లాంక్

శోభన్ బాబు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అందాల రారాజుగా చెరగని ముద్ర వేసుకున్న హీరో.అలనాటి సినిమాల్లో శోభన్ బాబు హీరో వేషం వేసాడంటే ఆ సినిమా తప్పనిసరిగ హిట్ అయ్యేది.

 List Of Sobhan Babu Rejected Movies Details, Shoban Babu, Shoban Babu Rejected M-TeluguStop.com

అంతలా శోభన్ బాబుకు స్టార్ డమ్ ఉండేది.ఎన్నో రికార్డులను తన పేర లిఖించుకున్న ఈ అందగాడు… సినిమాలను అత్యధిక సంఖ్యలో రిజెక్ట్ చేసి కూడా అరుదైన ఘనతను అందుకున్నాడు.

ఎక్కువగా సినిమాలు రిజెక్ట్ చేసిన హీరోగా ఆయన నిలిచిపోయాడు.ఇంతకీ శోభన్ బాబు అన్ని సినిమాలను ఎందుకు రిజెక్ట్ చేసాడా? అని చాలా మంది ఆలోచిస్తారు.

శోభన్ బాబు హీరోగానే తెర మీద కనిపించాలనుకున్నారు.అందుకోసమే తన వద్దకు వచ్చిన ఎన్నో సినిమాలను ఆయన రిజెక్ట్ చేశారు.మరికొన్ని హీరో కథలు కూడా ఆయనకు నచ్చక రిజెక్ట్ చేసిన జాబితాలో ఉన్నాయి.ఏదేమైనా శోభన్ బాబు అంటేనే ఓ హిస్టరీ.

అతడు రిజెక్ట్ చేసిన సినిమాలు కూడా కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి.

నాగార్జున నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ డివోషనల్ మూవీ అన్నమయ్య.

ఈ సినిమా నాగ్ కు ఎంతో పేరు తీసుకువచ్చింది.

Telugu Annamayya, Athadu, Balakrishna, Raghavendra Rao, Shoban Babu, Nagarjuna,

కానీ ఈ సినిమా మొదటగా శోభన్ బాబు దగ్గరికి వెళ్లిందట.శోభన్ బాబు ఈ సినిమాను చేయనని చెప్పేయడంతో తర్వాత డైరెక్టర్ రాఘవేంద్ర రావు నాగార్జునను పెట్టి కంప్లీట్ చేశారట.అంతే కాదు ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది.

ఈ సినిమాలోని వెంకటేశ్వర స్వామి రోల్ ను మొదట బాలక్రిష్ణ ను చేయమని అడిగితే తాను ఒప్పుకోకపోవడంతో తర్వాత సుమన్ చేశారట.

Telugu Annamayya, Athadu, Balakrishna, Raghavendra Rao, Shoban Babu, Nagarjuna,

కేవలం ఈ ఒక్క సినిమానే కాదు సుస్వాగతం, అతడు, హిందీ రిమేక్ బ్లాక్ అతడు రిజెక్ట్ చేసిన సినిమాల జాబితాలో ఉన్నాయి.అందాల నటుడు ఎన్ని సినిమాలను రిజెక్ట్ చేసినా కానీ ఆయన సినిమా వస్తుందంటే మాత్రం ప్రేక్షకులు నీరాజనాలు పలికారు.డబ్బుల కోసం ఏ క్యారెక్టర్లు అయినా చేసే ఈ రోజుల్లో శోభన్ బాబు తాను తీసుకున్న నిర్ణయం కోసం పెద్ద పెద్ద సినిమాలను రిజెక్ట్ చేయడం చాలా గ్రేట్ కదా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube