మరో వారం లో ఐపీఎల్ సందడి , గత 11 సీజన్ల ఐపీఎల్ విజేతలు , రన్నరప్ లు వీళ్ళే

ఐపీఎల్ అంటే తెలియని క్రికెట్ అభిమాని లేడు , ఒకప్పుడు వేసవి సెలవులు అంటే చుట్టాల ఊరేల్లో లేదా ఎక్కడికైనా టూర్ కి వెళ్లో కాలక్షేపం చేసేవాళ్ళు కానీ ఐపీఎల్ ప్రారంభం అయినప్పటినుండి వేసవి వేడితో పాటు ఐపీఎల్ క్రికెట్ వేడి కూడా ఎక్కువైపోతుంది.ప్రతి రోజు ఐపీఎల్ చూస్తూ భారతదేశ క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటారు .

 List Of Indian Premier League Seasons Winners And Runner Ups-TeluguStop.com

ఇప్పటి వరకు 11 సీజన్లు గడిచిపోయాయి.మే 23 నుండి 12 వ ఐపీఎల్ సీజన్ ఆరంభం కాబోతుంది.

గత 11 సీజన్ల విజేతలు , రన్నరప్పులు వీరే

2008- రాజస్థాన్ రాయల్స్


2008లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్లో అసాధారణ ఆటతీరుతో చెన్నై సూపర్ కింగ్స్‌పై 3 వికెట్ల తేడాతో గెలిచింది.ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 163 పరుగులు చేయగా.

రాజస్థాన్ 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

2009 – డెక్కన్ ఛార్జర్స్


2009లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌తో జరిగిన ఉత్కంఠ ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి వరకూ పోరాడిన డెక్కన్ ఛార్జర్స్ 6 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ జట్టు 143 పరుగులు చేయగా.ఛేదనలో బెంగళూరు 137/9కే పరిమితమైంది.

2010- చెన్నై సూపర్ కింగ్స్


2010లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది.ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 168 పరుగులు చేయగా.ఛేదనలో ముంబయి 146/9కే పరిమితమైంది.దీంతో.22 పరుగుల తేడాతో ధోనీ నాయకత్వంలోని చెన్నై జట్టు టైటిల్ గెలిచింది.

2011 – చెన్నై సూపర్ కింగ్స్


2011లో మరోసారి చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు అలవోక విజయంతో టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 205 పరుగులు చేయగా.ఛేదనలో బెంగళూరు 147/8తోనే సరిపెట్టింది.దీంతో.58 పరుగుల తేడాతో చెన్నై గెలిచింది.

2012 – కోల్‌కతా నైట్‌రైడర్స్


2012లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తొలిసారి టైటిల్ విజేతగా నిలిచింది.డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 190 పరుగులు చేయగా.మరో రెండు బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా లక్ష్యాన్ని ఛేదించేసింది.

2013 – ముంబయి ఇండియన్స్


2013లో ముంబయి ఇండియన్స్ టీమ్‌ తొలిసారి టైటిల్‌ను గెలిచింది.వరుసగా నాలుగోసారి ఫైనల్‌కి చేరిన చెన్నై సూపర్ కింగ్స్‌‌ను 23 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ను ముద్దాడింది.మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 148 పరుగులు చేయగా.అనూహ్యంగా చెన్నై 125/9కే పరిమితమైంది.

2014 – కోల్‌కతా నైట్‌రైడర్స్

2014‌లో రెండోసారి కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా నిలిచింది.కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో భారీ స్కోరు నమోదైన ఫైనల్ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలుపొంది.మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 199 పరుగులు చేయగా.మరో 3 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా ఆ లక్ష్యాన్ని ఛేదించేసింది.

2015 – ముంబయి ఇండియన్స్


2015లో మరోసారి ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన ముంబయి ఇండియన్స్ టైటిల్‌ను గెలిచింది.ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 202 పరుగులు చేయగా.ఛేదనలో తడబడిన చెన్నై 161/8కే పరిమితమైంది.దీంతో.41 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది.

2016 – సన్‌రైజర్స్ హైదరాబాద్


2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలిచింది.డెక్కన్ ఛార్జర్స్ స్థానంలో ఐపీఎల్‌లోకి వచ్చిన ఈ జట్టు ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 8 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 208 పరుగులు చేయగా.

ఛేదనలో క్రిస్‌గేల్, విరాట్ కోహ్లీ చెలరేగడంతో.మ్యాచ్‌ ఆఖరి వరకూ బెంగళూరు చేతుల్లోనే ఉంది.

కానీ.స్లాగ్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన హైదరాబాద్ ఆఖరికి ఆ జట్టుని 200/7కే పరిమితం చేసింది.

2017 – ముంబయి ఇండియన్స్


2017లో ఐపీఎల్‌ టైటిల్‌ను మూడుసార్లు గెలిచిన తొలి జట్టుగా ముంబయి ఇండియన్స్‌ రికార్డుల్లో నిలిచింది.రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఉత్కంఠ ఫైనల్ మ్యాచ్‌లో చివరి బంతి వరకూ పోరాడిన ముంబయి ఇండియన్స్ కేవలం ఒక పరుగు తేడాతో విజేతగా నిలిచింది.తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 129 పరుగులు చేయగా.ఛేదనలో పుణె జట్టు 128/6కే పరిమితమైంది.

2018 – చెన్నై సూపర్ కింగ్స్


2018లో రెండేళ్ల నిషేధం తర్వాత మళ్లీ టోర్నీలోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.మూడోసారి విజేతగా నిలిచింది.సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో షేన్ వాట్సన్ అసాధారణ శతకం బాదడంతో 8 వికెట్ల తేడాతో మ్యాచ్‌లో గెలుపొందింది.

తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 178 పరుగులు చేయగా.లక్ష్యాన్ని చెన్నై కేవలం 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube