ప్రపంచంలో మనిషి ఊహించనంత ఎత్తు నుంచి జాలువారే జలపాతాలు కూడా ఉన్నాయి.ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన జలపాతాల గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఏంజెల్ ఫాల్స్ ఇది దక్షిణ అమెరికాలోని చిన్న దేశమైన వెనిజులాలో ఉంది.
ఈ జలపాతం 979 మీ లేదా 3212 అడుగుల ఎత్తును కలిగి ఉంది.జలపాతం దాని భౌగోళిక స్థితి కారణంగా రహస్యంగా మిగిలింది.ఈ జలపాతానికి అమెరికన్ సాహసికుడు జేమ్స్ క్రాఫోర్డ్ ఏంజెల్ పేరు పెట్టారు.
తుగేలా జలపాతం:
తుగేలా అనేది 3110 అడుగుల ఎత్తు కలిగిన జలపాతం క్వాజులు ప్రావిన్స్‌లోని డ్రేకెన్స్‌బర్గ్ పర్వతంలోని తుగేలా నది మూలం వద్ద ఇది ఉంది.
కాటరాటస్ లాస్ ట్రెస్ హెర్మనాస్, పెరూ:
ఈ జలపాతాలు పెరూలో 914 మీటర్ల ఎత్తులో ఉన్న జలపాతం.మూడు శ్రేణుల కారణంగా వీటిని త్రీ సిస్టర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు.
ఓలోపెనా జలపాతం, యునైటెడ్ స్టేట్స్:
ఈ జలపాతాలు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన సముద్రతీర శిఖరాల నుండి వస్తాయి.ఇది హవాయి ద్వీపం మొలోకై యొక్క ఈశాన్య భాగంలో ఉంది.వీటి పొడవు 900 మీటర్లు
యుంబిల్లా జలపాతం, పెరూ:
ఇవి అమెజాన్ అడవుల్లో ఉన్నాయి.యంబిల్లో అనే పదానికి ప్రేమ హృదయం అని అర్థం.ఈ జలపాతం గుండె ఆకారాన్ని కలిగివుంటుంది.
విన్నూఫోసెన్ జలపాతం, నార్వే
విన్నూఫోసెన్ జలపాతం ఎత్తు 860 మీటర్లు.ఇది నార్వేలో ఉంది.ఇవి ఐరోపాలో అత్యంత ఎత్తయిన జలపాతాలు.
బ్లైఫోసెన్ జలపాతం, నార్వే:
ఇది విన్నూఫోసెన్ తర్వాత నార్వేలో రెండవ ఎత్తైన జలపాతం.ఇది 850 మీటర్ల ఎత్తుకలిగివుంది.హోర్డాలాండ్ ప్రావిన్స్‌లో ఉంది.
Pu’uka’oku Falls, యునైటెడ్ స్టేట్స్:
ఇవి హవాయిలోని మొలోకై దీవుల ఉత్తర తీరంలో ఉన్నాయి.పు’యుకా’కు జలపాతాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అత్యంత ఎత్తైనవి.ఈ జలపాతాల ఎత్తు 840 మీటర్లు.
జేమ్స్ బ్రూస్ ఫాల్స్, కెనడా ఇవి ఉత్తర అమెరికాలో అత్యధిక ఎత్తయిన జలపాతాలు.2,755 అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతుంది.
బ్రౌన్ ఫాల్స్: న్యూజిలాండ్
ఈ జలపాతాలు ఫియోర్డ్‌ల్యాండ్ నేషనల్ పార్క్‌లో ఉన్నాయి.ఈ జలపాతంలోకి నీరు బ్రౌన్ సరస్సు నుండి వస్తుంది.
ఈ జలపాతం ఎత్తు 836 మీటర్లు.