టూత్ పేస్టులో ఉండే కెమికల్స్‌ లిస్టు.. మింగితే వచ్చే నష్టాలు     2017-05-29   02:19:30  IST  Lakshmi P

దంతాలను శుభ్రం చేసుకోవడానికి ఇప్పటికీ వేపపుల్ల వేసుకునే మనుషులున్నారు మన పల్లెటూళ్ళలో. వారికి ఈ కెమికల్స్‌ వద్దు, సహజమైన, ఆరోగ్యకరమైన వేపపుల్లే కావాలి. అలాంటివారిని వెక్కిరిస్తారు సైన్స్ చదువుకన్న పట్నంవాళ్ళు. కాని ఇక్కడ మూర్ఖుడు ఎవరంటే టూత్ పేస్టుల మీద ఆధారపడ్డ పట్నం వాడే. ఎందుకంటే ఇప్పుడు మనం వాడే చాలావరకు టూత్ పేస్టులలో ఎలాంటి కెమికల్స్ ఉంటున్నాయో తెలుసా? పొరపాటులో పేస్టు మింగారనుకోండి .. మీకెంత హాని జరుగుతుందో తెలుసా?

* పెట్రోకెమికల్స్ వాడుతున్నారు. వీటిలో మన మెదడుని డ్యామేజ్ చేయగలిగే అలుమినియం, బేరియం, క్రోమియం వంటి మెటల్స్ ఉంటున్నాయి. ఇందులో D&C Dyes కూడా వాడటం దిగ్భ్రాంతికి గురిచేసే విషయం.

* మన ఎముకలని నాశనం చేయగలిగే సోడియం క్లోరైడ్ కూడా కలుపుతున్నారు. పేస్టుని మింగకపోయినా, దాన్ని దంతాలకి రుద్దుతున్నాం. అందుకే, ఈ కెమికల్ వల్లే మనిషి దంతాలు రాను రాను బలహీనపడుతున్నాయి.

* టూత్ పేస్టులలో హానికరమైన ట్రిక్లోసన్ కూడా ఉంటోంది. దీని వలన మీ మెదడు, థైరాడ్ అలాగే జననాంగాలు కూడా రిస్కులో పడతాయి.* కొన్ని టూత్ పేస్టులలో పెరాబిన్స్ కూడా వాడటం దురదృష్టకరం. ఈ కెమికల్స్‌ ఎండోక్రైన్ గ్లాండ్స్ మీద నెగెటివ్ ప్రమాదం చూపించి మన హార్మోన్స్ విడుదలలో బ్యాలెన్స్ తప్పేలా చేస్తుంది.

* కార్రాగీనన్ అనే మరోరకం కెమికల్ కూడా ఉంటోంది. వీటని జంతువుల మీద ప్రయోగిస్తే కోలన్ క్యాన్సర్ కలిగించే లక్షణాలు ఉన్నట్లు కనుగొన్నారు.

* పేస్టులో నురగ కోసం SLS and SLES (Sodium Lauryl Sulphate and Sodium Laureth Sulphate) వాడుతున్నారు. ఈ ఎలిమెంట్ వలన మన ఒంట్లోకి చాలా ప్రమాదకరమైన టాక్సిన్స్ వెళతాయి.

* ఇంకా చెప్పుకుంటూ పోతే హైడ్రేటెడ్ సిలికా, పోలిఎథిలిన్ గ్లైకోల్స్, ప్రోపిలిన్ గ్లైకోల్, మెర్కురి, ఆర్సెనిక్, కార్సినోజెన్స్ వంటి రకరకాల కెమికల్స్ కలుపుతున్నారు.