హైదరాబాద్ లో రెండు రోజులు మద్యం షాపులు బంద్..!

తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాసం బోనాల పండుగ జరుగుతున్నాయి.ముఖ్యంగా హైదరాబాద్ లో బోనాల జాతర బాగా జరుపుకుంటారు.

 Liquor Shopes Close In Hyderabad For Two Days Bonala Jathara-TeluguStop.com

ఈ నేపథ్యంలో రేపు, ఎల్లుండి జరుగనున్న బోనాల జాతర సందర్భంగా రెండు రోజుల పాటు మద్యం షాపులను బంద్ చేస్తున్నారు.మద్యం షాపులు, బార్లు, కల్లు కాంపౌండ్లు మూసి వేయనున్నారు.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్ల పరిధిలో దీనికి సంబందించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.బోనాల జాతర సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుండి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాల మూసివేత అమల్లో ఉంటాయి.

 Liquor Shopes Close In Hyderabad For Two Days Bonala Jathara-హైదరాబాద్ లో రెండు రోజులు మద్యం షాపులు బంద్..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిషేధిత ప్రాంతాల్లో ఎవరైనా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటారని పోలీసులు చెబుతున్నారు.అయితే రెండు రోజులు మద్యం దుకాణాలు దొరకవని తెలుసుకున్న జనాలు ముందు జాగ్రత్తగ మద్యం ముందే కొనేసుకుని పెట్టుకుంటున్నారు.

ఈ క్రమంలో హైదరాబాద్ లో శనివరం సాయంత్రం భారీ ఎత్తున మద్యం దుకాణాల ముందు జనాలు ఉన్నారు. పాతబస్తీలోని లాల్ దర్వాజా, అంబర్ పేట లోని మహంకాళీ ఆలయాల్లో ఆది, సోమవారాల్లో బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి.

ఈ రెండు రోజులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్స్ ఆంక్షలు కూడా విధిస్తున్నారని తెలుస్తుంది.

#Two Days #Telangana #Hyderabad City #Liquor Shopes #Bonala Jathara

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు