అక్కడ మద్యం దుకాణాలు తెరుస్తున్నారంటగా... మరి ఇక్కడ ఎందుకు...

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో ఈ మహమ్మారి వైరస్ ని నియంత్రించేందుకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ లాక్ డౌన్ కారణంగా ప్రజలకు అవసరమయ్యేటువంటి సదుపాయాలు తప్ప మిగిలిన అన్ని అనవసర సదుపాయాలను మూసివేశారు.

 Drinkers Diamond To The Open Liquor Shop Daily 2 3 Hours In Telugu States Liquo-TeluguStop.com

దీంతో మద్యపానం, ధూమపానం చేసేటువంటి వ్యక్తులు మందు, సిగరెట్లు దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.అంతేకాక ఇప్పటికే కొంతమంది విచక్షణ కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మద్యం దొరక్క మందుబాబులు అల్లాడుతున్నారు.అంతేగాక ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.దీంతో మందుబాబులు ప్రభుత్వాన్ని నిత్యావసర సరుకులలాగే ప్రతిరోజు రెండు లేదా మూడు గంటల సమయం పాటు నిబంధనలతో కూడినటువంటి మద్యాన్ని విక్రయించాలని మరియు మద్యం దుకాణాలను తెరవాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే గతంలో బాలీవుడ్ స్టార్ హీరో రిషి కపూర్ కూడా ఈ విషయం గురించి తన అధికారిక ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే మందుబాబు దృష్టిలో ఉంచుకొని కేరళ మరియు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ లాక్ డౌన్ ఉన్న సమయంలో మూడు గంటల పాటు మద్యం విక్రయించాలని సన్నాహాలు చేస్తున్నాయి.అయితే ఇందుకుగాను లైసెన్సు పొందినటువంటి వైద్యులతో మద్యం అనుమతుల సర్టిఫికెట్ ని తీసుకు రావాల్సి ఉంటుందని కూడా తెలిపారు.

దీంతో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని మందు బాబులు కూడా తమ రాష్ట్రంలో కూడా మద్యం దుకాణాలను తెరవాలంటూ ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నారు.మరి ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ విన్నపం పై ఎలా స్పందిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube