వేసవి తాపాన్ని తట్టుకోలేక మందుబాబులు ఏం చేస్తున్నారంటే.. !

తెలంగాణలో అప్పుడే వేసవి తాపం మొదలైంది.భానుడి భగభగకు ప్రజలంతా చిటపటలాడుతుండగా చెమటలు కక్కుతున్న దేహం మాత్రం చల్లదనాన్ని కోరుకుంటుంది.

 Liquor Sales Increased In Telangana, Telangana, Hyderabad, Beer Sales, Record Le-TeluguStop.com

సరిగ్గా మందు బాబులు కూడా ఇలాంటి చల్లదనాన్నే ఆస్వాధిస్తూన్నారట.ఎలాగంటారా.

మద్యం ద్వారా.ఆ విషయం ఏంటో తెలుసుకుంటే.

తెలంగాణలో ఈ ఏప్రిల్ నెల తొలి వారంలోనే మద్యం అమ్మకాల జోరు పెరిగిందట.ఎండలు దంచికొడుతుండటంతో ఆ వేడికి తట్టుకోలేని మందుబాబులు తెగ బీర్లు తాగేస్తున్నారట.

ఇకపోతే హైదరాబాద్‌ లో గతేడాది మార్చిలో 26.35 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగితే.ఈ ఏడాది మార్చి నెలలో ఏకంగా 29.59 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయని ఎక్సైజ్ అధికారుల లెక్కల ద్వారా తెలుస్తోంది.ఈ లెక్కలను బట్టి రోజుకు సగటున మద్యం ప్రియులు 90 వేలకు పైగా ఐఎంఎల్, 74 వేలకు పైగా బీర్ కేసులు తాగుతున్నారని తెలుస్తోంది.ఇక ఇలా వేసవి ప్రారంభంలోనే బీర్ల అమ్మకాలు ఇంత జోరు మీద ఉంటే మే నెలలో ఇంకెంత స్పీడ్‌లో ఉంటాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube