ఏపీలో మద్యం విక్రయాల సమయం పొడిగింపు

ఏపీలో మద్యం ప్రియులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.రాష్ట్రంలో మద్యం విక్రయాల సమయాన్ని పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ మేరకు అమ్మకాల సమయం పెంచుతూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయాల సమయం పెంచుతున్నట్లు తెలిపింది.

దీంతో మద్యం దుకాణాల్లో రాత్రి 12 గంటల వరకు అమ్మకాలు కొనసాగనున్నాయి.అదేవిధంగా బార్లు, హోటళ్లు, ఈవెంట్లలో రాత్రి ఒంటిగంట వరకు మద్యం విక్రయాలకు అనుమతి లభించింది.

అయితే ఇవాళ, రేపు మాత్రమే మద్యం విక్రయాల వేళల పొడిగింపు వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు