మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్  

AP Govt Reduces Liquor rates, liquor prices, AP Govt, Liquor drinkers,Lockdown - Telugu Ap Govt, Ap Govt Reduces Liquor Rates, Liquor Drinkers, Liquor Prices, Lockdown

మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది.ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉండటంతో మందుబాబుల జేబుకు చిల్లులు పడుతున్న విషయం తెలిసిందే.

TeluguStop.com - Liquor Rates Decrease In Ap

అధిక ధరలు పెట్టి మందుబాబులు మద్యం కొనలేని పరిస్థితి నెలకొంది.ఈ క్రమంలో మందుబాబులకు ఊరట కలిగించేలా తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో మద్యం ధరలను మరోసారి ప్రభుత్వం సవరించింది.ఈ సవరించిన మద్యం ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది.భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం, మీడియం, ప్రీమియం బ్రాండ్ల ధరలను తగ్గించిన ప్రభుత్వం.రూ.50 నుంచి రూ.1,350 వరకూ వివిధ కేటగిరీల్లో మద్యం ధరలు తగ్గించింది.

మద్యం ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించడం ఇది తొలిసారి కాదు.

TeluguStop.com - మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్-General-Telugu-Telugu Tollywood Photo Image

గతంలో అనేకసార్లు పెంచడం, తగ్గించడం చేసింది.లాక్‌డౌన్ తర్వాత మధ్యం ధరలను భారీగా పెంచిన ప్రభుత్వం.

ఆ తర్వాత ఇటీవల కొంతవరకు తగ్గించింది.ఈ క్రమంలో తాజాగా మరోసారి మద్యం ధరలను తగ్గించింది.

మద్యం ధరలు తగ్గించడంపై మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఏపీలో మద్యం ధరలను అధిక ధరలకు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

బాటిల్ మీద ఒక రేటు ఉంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.అలాగే ఏపీలో రోజుకో మద్యం బ్రాండ్ వస్తుందని, ప్రభుత్వ మద్యం షాపుల్లో మందుబాబులు అడిగిన బ్రాండ్ కాకుండా తమకు నచ్చిన బ్రాండ్‌లను అధికారులు విక్రయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

#Liquor Prices #Lockdown #Liquor Drinkers #AP Govt #APGovt

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Liquor Rates Decrease In Ap Related Telugu News,Photos/Pics,Images..