మద్యం ధరలు పెంచిన తెలంగాణా సర్కార్..!

మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది.మద్యం ధరలను పెంచుతూ బుధవారం నిర్ణయం తీసుకుంది.

 Liquor Price Hike In Telangana State , Excide Department , Liquor, Liquor Price,-TeluguStop.com

పెరిగిన ధరలు గురువారం (మే 19) నుంచి అమలులోకి రానున్నాయి.ఇక పెంచిన ధరల విషయానికి వస్తే క్వార్టర్ పై 20 రూపాయలు, హాఫ్ పై 40, ఫుల్ బాటిల్ పై 80 రూపాయలు పెంచినట్టు తెలుస్తుంది.

బీరు పై 20 రూ.లు పెంచుతున్నట్టు ఎక్సైజ్ శాఖ ప్రకటనలో తెలిపింది.

తెలంగాణాలో మద్యం అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి.సమ్మర్ అవడం వల్ల బీర్ల అమ్మకాలు ఎక్కువగా ఉందని తెలుస్తుంది.పెరిగిన ధరలతో ఎక్సైజ్ శాఖకు మరింత ఆదాయం రానుంది.ఎక్సైజ్ శాఖ పెంచిన ఈ ధరలతో మందుబాబుల జేబులకు చిల్లు పడే అవకాశం ఉంది.

కరోనా టైం లో లిక్కర్ సేల్స్ తగ్గాయన్న టాక్ రాగా ఆమధ్య బీర్ ధరలను తగ్గించారు.ఇప్పుడు మళ్లీ అమ్మకాలు పెరగడంతో ఎక్సైజ్ శాఖ బీరుతో పాటుగా అన్నిటి రేట్లని పెంచింది.

పెరిగిన రేట్లతో ఎక్సైజ్ శాఖ లాభపడనుందని చెప్పొచ్చు. ఉన్నపళంగా తెలంగాణా ఎక్సైజ్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు మాత్రం షాక్ అవుతున్నారు.

మందు బాబులకి తాగకుండానే కిక్ ఎక్కేలా చేస్తుంది తెలంగాణా ప్రభుత్వం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube