మందును తరలించడానికి వీరు ఏం చేశారో తెలుసా?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.దాని ఫలితంగానే మందు ధరలు అమాంతం పెరిగిపోయాయి.

 Liquor Illegally Transporting From Telangana To Ap, Ap, Telangana, Liquor Bottles-TeluguStop.com

దీని కారణంగా మందు వినియోగం రాష్ట్రంలో తగ్గుముఖం పట్టింది.రాష్ట్రంలో ఆకాశాన్నంటుతున్న మందు ధరలను చూసి మందు బాబులు మందు తాగడానికి ధైర్యం చేయట్లేదు.

దీంతో ఈ టైంని క్యాష్ చేసుకోవడానికి కొందరు ప్రబుద్ధులు పక్క రాష్ట్రం నుండి ఏపీలోకి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారు.ఈ అక్రమ రవాణాను ఏపీ పోలీసులు ఎప్పటికప్పుడు చాకచక్యంగా వ్యవహరిస్తూ కట్టడి చేస్తున్నారు.

 Liquor Illegally Transporting From Telangana To AP, AP, Telangana, Liquor Bottles-మందును తరలించడానికి వీరు ఏం చేశారో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఇలా తెలంగాణ రాష్ట్రం నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న కొందరు ప్రబుద్ధులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

వీరు తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ లోకి మద్యాన్ని అక్రమంగా తేవడానికి సరికొత్త టెక్నిక్ ని ఉపయోగించారు.దీన్ని చూసిన పోలీసులు కూడా విస్తుపోయారు.

ఈ ప్రబుద్ధులు సిలిండర్ కింద ఒక మూతను ఏర్పరిచి సిలిండర్ లో దాదాపు 100 క్వార్టర్ బాటిల్ లను ఉంచి తెలంగాణ నుండి ఆంధ్రాకు తరలిస్తున్న వీరు జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్ గారి చేతికి దొరికారు .ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.దానిపై మీరు కూడా ఓ లుక్ వేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube