గుడ్ న్యూస్ : ఇక నుంచి మద్యం హోమ్ డెలివరీ...

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలను మూసివేసిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ కారణంగా పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే సమయంలో మద్యం సేవించేటువంటి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 Liquor Home Delivery, Karnataka News, Wines News, Lock Down, Liquor Home Deliver-TeluguStop.com

అంతేకాక మరికొంత మంది విచక్షణ కోల్పోయి వింతగా ప్రవర్తిస్తుండడంతో పాటు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త నిర్ణయం తీసుకోనున్నాయి.

అయితే తాజాగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మందుబాబుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇక నుంచి ప్రతి రోజు మూడు గంటల పాటు మధ్యాన్ని తమ నివాసాలకు మద్యం డెలివరీ చేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు.అయితే లాక్ డౌన్ విధించడం కంటే ముందుగానే ఈ ఆన్ లైన్ లో మద్యం బుక్ చేసుకునే ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది.

అందువల్లే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు ఈ ప్రయోగం బాగా ఉపయోగపడుతుంది అని కొందరు అభిప్రాయపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు కేరళ, కర్ణాటక మరియు మరో ఆరు రాష్ట్రాలు మద్యం విక్రయాలకు అనుమతులు జారీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా తొందర్లోనే ఈ విషయానికి సంబంధించినటువంటి మరో కీలక నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube