లిక్కర్ కేసు కారణంగా కవిత ప్రతిష్ట తగ్గిందా.. స్వేచ్చగా బతుకమ్మ ఆడలేకపోతున్నారా ?

ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగకు బ్రాండ్ నెమ్ తీసుకురావడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత కీలక పాత్ర పోషించారు.ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైనప్పటి నుంచి కవిత ఉద్యమాల సమయంలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.

 Liquor Case Impact On Kavitha Political Career , Telangana, Politics,  Mlckavith-TeluguStop.com

బతుకమ్మను బూర్జ్ ఖలీఫాపై ప్రదర్శి్ంచేలా చేశారు.కవిత ఎక్కడ బతుకమ్మ ఆడిన మంచి ఆదరణ కనిపించేది.

అయితే ఇప్పుడు కవితపై వస్తున్న కొన్ని అవినితి ఆరోపణల కారణంగా స్వేఛ్చగా బతుకమ్మ ఆడలేకపోతున్నారు.ఆమె ప్రతిష్ట క్రమంగా మసకబాతున్నట్లు కనిపిస్తుంది.

తాజాగా కవితకు లాయర్ల నుండి నిరసన ఎదురైంది.

కోర్టు ఆవరణలో బతుకమ్మ ఆడకుండా లాయర్లు అడ్డుకోవడంతో కవితకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.

కొందరు న్యాయవాదులు కవితను ప్రాంగణంలోకి రానీయకుండా అడ్డుకున్నారు.ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అక్కడికి చేరుకుని కొందరు న్యాయవాదులను అదుపులోకి తీసుకున్నారు.

తాజాగా రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో కవిత బతకమ్మ ఆడడానికి రాగా కొందరు న్యాయవాదులు ఆమెతో వాగ్వాదానికి దిగారు.తమ సమస్యలను, సమస్యలను పరిష్కరించడంలో తాము చేసిన అభ్యర్థనలను పరిశీలించడంలో ప్రభుత్వం ఆసక్తి చూపనప్పుడు బతుకమ్మ ఆడేందుకు ఎలా ప్రాంగణంలోకి ప్రవేశిస్తారని ప్రశ్నించారు.


Telugu Latest, Mlckavitha, Telangana, Trsy-Political

తెలంగాణ ప్రాంత సంప్రదాయ పండుగకు మరింత ప్రాచుర్యం పోందేలా.వీలైనంత ఎక్కువ మంది మహిళలను పాల్గొనేలా చేయడంలో కవిత తన వంతు పాత్ర పోషించారు.పండగకు ప్రాచుర్యం కల్పించిన కవిత ఎక్కడికి వేళ్ళిన ఆదరణ ఉండేది.లిక్కర్ కేసు కారణంగా ఆమె ప్రతిష్ట తగ్గుతున్నట్లు కనిపిస్తుంది.ప్రభుత్వ వ్యతిరేక విధానంలో రూపంలో ఇలా ఆమెను న్యాయవాదుల ఆడ్డుకోవడం కవిత రాజకీయ భవిష్యత్‌పై నీలి నీడాలు కమ్ముకునేలా చేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube