ఏపీలో సంపూర్ణ మద్య పాన నిషేధం స్టార్ట్ అయిందట.....మరి మందు బాబులు పరిస్థితేంటి....

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ దూసుకుపోతున్నాడు.ఇప్పటికే రైతు భరోసా, అమ్మ ఒడి, 5 లక్షల ఉద్యోగాల ఉపాధి కల్పన వంటివాటిని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా అమలు చేశారు.

 Liqueur Shops, 13% Closed, Andhra Pradesh, Ys Jagan Mohan Reddy,-TeluguStop.com

కాగా ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని ఇచ్చినటువంటి హామీపై తాజాగా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా నేటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మద్యం దుకాణాల శాతంలో 13 శాతం వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు.

ఇలా చేయడం వల్ల దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 535 మద్యం దుకాణాలు నేటి నుంచి కనుమరుగవుతున్నాయి.దీంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అంతేగాక రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధించడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి పలువురు అభినందిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రతి ఏడాది పాటు వృద్ధాప్య పింఛను 250 రూపాయలు పెంచుతున్నట్లు అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.

కాగా ఇటీవలే వైకాపా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవీ పగ్గాలు చేపట్టి సంవత్సర కాలం ముగియడంతో వచ్చేనెల నుంచి పింఛన్లకు 250 రూపాయలు అదనంగా చేర్చి అందించనున్నారు.

అయితే రాష్ట్రంలో ఇప్పటికే మద్యం అమ్మకాల జోరుకి అడ్డుకట్టవేసేందుకు మద్యం ఎమ్మార్పీ ధరల పై దాదాపుగా 75% రేట్లు పెంచారు.

అయినప్పటికీ మద్యం అమ్మకాలులో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదు.దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ మద్యం దుకాణాల మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube