నీ స్నేహం కావాలంటున్న సింహం.. నా వ‌ల్ల కాదంటున్న శున‌కం

ఫ్రెండ్ షిప్ గ్రేట్ నెస్ అందరికీ తెలిసే ఉంటుంది.స్నేహం కోసం ప్రాణాలు ఇస్తుంటారు కొందరు.

 Lion Friendship With Cute Dog Video Going Viral On Social Media, Lion And Dog Fr-TeluguStop.com

అలా తమ మిత్రుత్వం కలకాలం ఉండాలని ఆకాంక్షిస్తుంటారు కూడా.ఇకపోతే ఈ స్నేహం అనేది కేవలం మనుషుల మధ్యనే ఉందనుకుంటే మీరు పొరపడినట్లే.

జంతువులు కూడా స్నేహ పూర్వక భావనను కలిగి ఉంటాయి.మరో జంతువుతో స్నేహ బంధంలో ఉంటాయి.

తాజాగా ఈ కోవకు చెందిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరలవుతోంది.సదరు వీడియోలో సింహం, కుక్క స్నేహం చేసుకుంటున్నాయి.

రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే.ఆ మాదిరిగా ఇక్కడ ఫ్రెండ్ షిప్‌కు‌గాను ఇద్దరు వ్యక్తులు లేదా జంతువులు ఉండాలి.ఇకపోతే వైరలవుతున్న వీడియోలో తనతో ఫ్రెండ్ షిప్ చేయాలని లయన్ డాగ్‌ను రిక్వెస్ట్ చేసింది.అయితే, డాగ్ లయన్ రిక్వెస్ట్ ‌ను యాక్సెప్ట్ చేయలేదు.

నీతో ఫ్రెండ్ షిప్ నా వల్ల కాదు అన్న మాదిరిగా ఎక్స్ ప్రెషన్ ఇచ్చేసి అక్కడి నుంచి పారిపోయింది.ఈ ఘటన ఓ జూలో జరిగింది.

వీడియోలో లయన్ దానంతట అదే వచ్చి డాగ్ కాలును తీసుకుని తన కాలుతో షేక్ హ్యాండ్ ఇచ్చినట్లు ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.

ఈ క్రమంలోనే సింహంను చూసిన కుక్క.తన కాలును లాగేసుకుని అక్కడి నుంచి పారిపోయింది.అయితే, సింహాన్ని చూసి కుక్క భయపడిందని, అందుకే అలా పారిపోయిందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సింహం స్నేహానికి హస్తం చాపగా, కుక్క నా వల్ల కాదంటూ పారిపోయిందన్న మాట అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.జనరల్‌గా యానిమల్స్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంటాయి.

ఈ క్రమంలోనే సింహం వీడియోకు ఇంకా ఎక్కువ ఆదరణ లభిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube