జేడీ లక్ష్మీనారాయణ చేరికపై తొలిగిన ఉత్ఖంట..ఆ ఎంపీ సాక్షిగా       2018-07-07   03:24:37  IST  Bhanu C

జేడీ లక్ష్మీ నారాయణ తన సీబీఐ జేడీ పదవికి రాజీనామా చేస్తున్నరాని వార్తలు వచ్చినప్పటి నుంచీ ఇప్పటి వరకూ కూడా ఎన్నో రకాల ఊహాగానాలు జరిగాయి కొంతమంది బీజేపీ ప్లాన్ ప్రకారమే జేడీ ఉద్యోగం వదిలి వచ్చారని కామెంట్స్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం కాదు కాదు జేడీ తెలుగుదేశం పార్టీలోకే అంటూ జోస్యం చెప్పారు..ఇదిలాఉంటే ఒకే భావజాలం ఉన్న వ్యక్తులు పవన్, జేడీ లు కావున వారు తప్పకుండా ఇద్దరూ కలుస్తారని మరికొందరు వ్యాఖ్యలు చేశారు అయితే

ఈ క్రమంలోనే జేడీ ఎన్నో సార్లు ఈ వ్యాఖ్యలు ఊహాగానాలకి తెరదించుతూ ఖండిస్తూ వచ్చారు అయితే కొత్త పార్టీ పెడుతారా అని అడిగిన వ్యాఖ్యలకి కూడా జేడీ నేను రాజకీయ నాయకుడిని కాదు అంటూ సైలెంట్ అయ్యే వారు..

కానీ ఇంతవరకు లక్ష్మీనారాయణ ఏ పార్టీ లో చేరుతారనే దాని పై స్పష్టత ఇవ్వలేదు. దీనితో అయన రాజకీయ రంగ ప్రవేశం చెయ్యటం ఖాయం అని తేలిపోయింది. ఈ నేపధ్యం లో కోస్తాఆంధ్ర కు చెందిన ఒక తెదేపా ఎంపీ తనకి జేడీ తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా టీడీపీ లోకి ఆయన్ని తీసుకువచ్చే భాద్యత సదరు ఎంపీ తీసుకున్నారట ఆ తెదేపా ఎంపీ తొలుత ఆహ్వానించినపుడు జెడి ఆలోచించి చెప్తాను అన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి కూడా

అయితే ఇక్కడ మరొక విషయంపై కూడా జేడీ తర్జన భర్జన అవుతున్నారని తెలుస్తోంది అంటున్నారు అదేంటంటే..గతంలో జగన్ కేసులో లెక్కకి మించిన చార్జిషీట్ లు పెట్టి అన్యాయంగా ఇరికించారు దానికి కారణం తెలుగుదేశం ,జేడీ ఒక్కటి కావడం వల్లే అంటూ సందేహం వ్యక్తం చేస్తారని జేడీ అభిప్రాయ పడుతున్నారట. ఆయ్తీ తాజాగా కడప ఉక్కు పరిశ్రమ కోసం టిడిపి ఎంపీ సీఎం రమేష్ చేపట్టిన ఉక్కు దీక్షని వేదిక చేసుకుని అక్కడకి వెళ్తే టీడీపీ లోకి జేడీ ఎంట్రీ లాంచానమే అనే ఉద్దేశ్యం వస్తుందనే అభిప్రాయంతో ఉన్న జేడీ కడప వేదికపైకి ఎక్కి మరీ రమేష్ కి మద్దతు తెలిపారని తెలుస్తోంది అంటున్నారు,

అయితే జేడీ ఎంతో మంది నేతలని గానీ భాదిత ప్రజలని కలవడానికి రాష్ట్రాలు తిరిగినప్పుడు అధికార పార్టీ పై మీద ఒక్క విమర్శ కూడా చేయకపోవడంతో మరింత సందేహం కలిగిస్తోందని అంటున్నారు విశ్లేషకులు..ఈ మధ్య కాలంలో ఏపీలో ప్రత్యేక హోదా కోసం అనేక ఉద్యమాలు జరిగినా ఏ ఒక్కదానికి మద్దతు తెలుపని జెడి కడపలో ప్రత్యక్షమవడం పై పలు ప్రశ్నలకు సమాధానం దొరికినట్టు అయ్యింది…అయితే కడప ఉక్కు కోసం వైసీపి కూడా దీక్ష చేపడితే కేవలం టీడీపీ దీక్షకి వెళ్ళడంతో జేడీ మనసులో మాట తెలిసిందని త్వరలోనే జేడీ టీడీపీ రంగప్రవేశం ఉంటుందని అంటున్నారు.